పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ ఫకార్ జమాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఫకార్ జమాన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ కొట్టిన బౌండరీని ఆపే క్రమంలో ఫకార్ జమాన్ జారీ పడ్డాడు. దాంతో అతనికి గజ్జల్లో గాయమైంది.
నొప్పి తీవ్రంగా ఉండటంతో మైదానం వీడాడు. బ్యాటింగ్ సందర్భంగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. కాకపోతే ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడాడు. 41 బంతుల్లో 24 పరుగులు చేసి ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. ఔటైన అనంతరం చాలా బాధగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ఫకార్ జమాన్.. కుర్చీలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో అతన్ని అసిస్టెంట్ కోచ్‌లతో పాటు షాహిన్ అఫ్రిది ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయ్యింది.

వాస్తవానికి ఫకార్ జమాన్ చాలా రోజులుగా పాకిస్థాన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు సామ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో అవకాశాన్ని అందుకున్నాడు. కానీ తొలి మ్యాచ్‌లోనే గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. వచ్చిన అవకాశం గాయం కారణంగా చేజారడంతోనే ఫకార్ జమాన్ ఏడ్చి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు ఫకార్ జమాన్ గాయంతో దూరమవ్వడం ఎదురెదెబ్బే. మరీ ముఖ్యంగా భారత్‌తో హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఎంతో అనుభవం కలిగిన ఫకార్ జమాన్ జట్టులో లేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం చూపనుంది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం భారత్‌తో ఆడనుంది. సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ తప్పనిసరిగా గెలవాలి.
FAKHAR ZAMAN, THE FIGHTER 🫡🇵🇰
— junaiz (@dhillow_) February 20, 2025
Pakistan may not see a player like Fakhar Zaman again. Players like him come once in decades. The selfless man who always gives his 100% for the country, no matter what. Hope he recovers soonpic.twitter.com/JwIpyZGRXD