Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్.. మైదాన పరిస్థితి ఏందంటే..?

కొలంబో: ఆసియాకప్ 2023‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఈ మ్యాచ్‌ అయినా సజావుగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సూపర్-4 మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించారు.

వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే.. సోమవారం కొనసాగిస్తారు. అయితే కొలంబో వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఆదివారం 90 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్‌కు కచ్చితంగా అంతరాయం కలిగించనుంది. అయితే ఇదే వేదికపై శనివారం జరిగిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌ సజావుగా సాగింది. భారత్-పాక్ మ్యాచ్ కూడా జరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

IND vs PAK: Colombo Weather Update, Cloudy Morning

ప్రస్తుతం కొలంబోలో మేఘాలు కమ్ముకున్నాయి. చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతోంది. ఇక సూపర్ 4 దశలో పాక్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌తో ఓ మ్యాచ్‌ ఆడి ఘనవిజయం సాధించింది. భారత్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కూడా పాక్‌ బౌలర్ల ప్రదర్శన గొప్పగా సాగింది. ఆరంభంలో, చివర్లో పేసర్లు విజృంభించి భారత్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు.

సూపర్‌-4 మ్యాచ్‌ పిచ్‌ కూడా బౌలర్లకే అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్‌కు సవాలు తప్పకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బుమ్రాకు.. బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

తనకు కొడుకు పుట్టడం వల్ల నేపాల్‌తో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఈ సూపర్ మ్యాచ్‌కు అతను తిరిగి జట్టులోకి వస్తున్నాడు. బుమ్రా స్థానంలో ఆడిన సీనియర్‌ పేసర్‌ షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరో పేసర్‌ శార్దూల్‌ ఇటీవలి ఫామ్‌ కూడా ఏమంత గొప్పగా లేని నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరు బుమ్రా కోసం తమ స్థానాన్ని త్యాగం చేస్తారో చూడాలి.

పిచ్‌ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాలే నేపథ్యంలో ఈ ఇద్దరినీ కాదని.. జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌నూ దించే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్ కోసం ఎవర్ని పక్కనపెడతారో చూడాలి.

తుది జట్లు

భారత్‌ (అంచనా): రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌/ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్‌ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

పాకిస్థాన్‌: ఇమాముల్‌, జమాన్‌, బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌, షహీన్‌, రవూఫ్‌, నసీమ్‌.

Story first published: Sunday, September 10, 2023, 7:47 [IST]
Other articles published on Sep 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+