
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి.
Paralympics 2020: భారత్ ఖాతాలో 11వ పతకం..హై జంప్‌లో ప్రవీణ్‌కు రజతం!!

టీమిండియాను ఓడించి శుభారంభం చేస్తాం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్ రమీజ్ రాజాతో బాబర్ ఆజామ్ సమావేశం అయ్యాడు. ఈ సమావేశం అనంతరం బాబర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదటి మ్యాచులోనే టీమిండియాకు ఎదుర్కోవడంను ఎలా ఫీల్ అవుతున్నారు అని ఓ విలేకరి ప్రశ్నించగా... 'పాకిస్థాన్‌తో పోల్చితే భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుంది. టీమిండియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం. కోహ్లీసేనపై మాదే పైచేయి. వారిని కచ్చితంగా ఓడిస్తాం' అని అన్నాడు.

జట్టుగా ఆడి చాలా రోజులైంది
'టీమిండియా ఆటగాళ్లు జట్టుగా టీ20 మ్యాచులు ఆడి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టులు ఆడుతోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతారు. అక్కడ జట్టుగా కాకుండా ఒక్కో జట్టుకు ఆడుతారు. ఇక యూఏఈ మాకు సొంతిల్లు లాంటిది. అక్కడ అన్ని మాకు సానుకూలాంశాలే ఉంటాయి.
అందుకే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో గెలవడానికి 100 శాతం మేం ప్రయత్నిస్తాం. టోర్నీని విజయంతోనే ఆరంభిస్తాం' అని బాబర్ ఆజామ్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్ ఇటీవలే రెండు గ్రూపులుగా విడిపోయి సిరీస్‌లు ఆడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ప్రధాన జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఆడుతోంది. శ్రీలంక పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వన్డే, టీ20 సిరీస్‌ల్లో పాల్గొంది. ఆ తర్వాత ఐపీఎల్ ఆడనుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ పూర్తి జట్టుగా టీ20 మ్యాచ్ ఆడే వీలులేదు.

గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.


Click it and Unblock the Notifications
