IND vs PAK: విజయానందంలో ఉన్న పాకిస్థాన్‌కు గట్టిషాక్.. గాయంతో ఆ మ్యాచ్ విన్నర్ దూరం!

దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో గెలుపొందిన పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ తీవ్రంగా గాయపడ్డాడు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగానే వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడ్డ మహమ్మద్ రిజ్వాన్ నొప్పితో విలవిలలాడాడు. బౌలర్ వేసిన బౌన్సర్ అందుకునే క్రమంలో రిజ్వాన్ మొకాలికి గాయమైంది. బంతి కోసం పైకి జంప్ చేసిన రిజ్వాన్ కింద ల్యాండ్ అయ్యే సమయంలో అతని మొకాలు బెణికింది. దాంతో కుప్పకూలిన అతను.. పాకిస్థాన్ ఫిజియో ఇచ్చిన పెయిన్ కిల్లర్లతో తన ఆటను కొనసాగించాడు.

హాఫ్ సెంచరీతో..
కాస్త అసౌకర్యంగా ఫీలైనా.. బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా ఆఖరి వరకు క్రీజులో నిల్చొని విజయానికి బాటలు వేసాడు. అయితే అతని గాయం తీవ్రత తెలుసుకునేందుకు మ్యాచ్ ముగిసిన అనంతరం రిజ్వాన్‌ను ఆసుపత్రికి తరలించి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ తీసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదు. కానీ ముందు జాగ్రత్తగా అతన్ని అఫ్గానిస్థాన్‌తో బుధవారం(సెప్టెంబర్ 7) జరిగే మ్యాచ్‌కు రెస్ట్ ఇవ్వాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం రిజ్వాన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పాకిస్థాన్ బ్యాటింగ్ బలహీనంగా మారనుంది. అతనొక్కడే ఆ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మోస్తున్నాడు.

పాక్ విజయం కోసం ఏమైనా..
51 బంతుల్లో 71 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రిజ్వాన్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన గాయంపై స్పందించాడు. 'ప్రస్తుతానికి నా కాలికి అయిన గాయం బాగానే ఉంది. నొప్పితో మ్యాచ్ ఆడకపోవడమే ఉత్తమమని భావించా. కానీ పాకిస్థాన్ విజయం కంటే నాకు ఏది ఎక్కువ కాదని భావించి ఆటను కొనసాగించా. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ని చూస్తుందని తెలుసు. ఈ గేమ్ ఫైనల్‌గా మాకు చాలా విలువైనది. ఈ మ్యాచ్‌లో ఆడే ఇరు జట్ల ప్లేయర్లు తమ 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటిలాగే మా ఇద్దరిలో (బాబర్ ఆజామ్, రిజ్వాన్) ఒకరు లాంగ్ టైం బ్యాటింగ్ చేసేలా క్రీజులో ఉండాలి.

కించిత్ భయపడలేదు..
కొత్త బంతిపై కాస్త జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ చేయాలనేది ప్లాన్. నేను చివరి వరకు ఉండేందుకు ప్రయత్నించాను. మా దమ్మేంటో మాకు తెలుసు.. మా బ్యాటింగ్‌లో మంచి డెప్త్ ఉంది. చివరి నాలుగు ఓవర్లలో ఏ జట్టుపైన అయినా ఈజీగా 45పరుగులు కొట్టగల పవర్ హిట్టర్లు మా జట్టులో ఉన్నారు. కాబట్టి మేము కించిత్ భయపడలేదు.' అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్ ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం కాగా.. రేపు సూపర్-4 రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్ గెలవాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications