ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానం వీడాడు. అతని చీల మండ గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. తొలి స్పెల్‌లో మూడు ఓవర్లు మాత్రమే వేసిన మహమ్మద్ షమీ 13 పరుగులు ఇచ్చాడు.
ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నాలుగో బంతి వేసిన అనంతరం షమీ నొప్పితో బాధపడ్డాడు. దాంతో మైదానంలోకి ఫిజియోలు రాగా.. చీల మండ ప్రదేశంలో నొప్పిగా ఉన్నట్లు వారికి షమీ సూచించాడు. ఈ ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం షమీ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
India vs Pakistan Live స్కోరు కార్డు

15 నెలల తర్వాత..
మహమ్మద్ షమీ చీల మండ గాయంతోనే దాదాపు 15 నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా ఆడిన అతను అనంతరం చీల మండ గాయానికి శస్త్ర చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20తో సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో షమీ ఫామ్‌లోకి వచ్చాడని అంతా అనుకున్నారు.
తొలి ఓవర్‌లోనే 5 వైడ్స్..
పాకిస్థాన్‌తో బిగ్ మ్యాచ్‌లోనూ అదే తరహాలో చెలరేగుతాడని భావించారు. అందుకు తగ్గట్లుగానే షమీ ఫస్ట్ స్పెల్‌లో కట్టడిగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్‌లో ఐదు వైడ్స్ వేసినా.. తర్వాతి రెండు ఓవర్లలో లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ గాయం తిరగబెట్టడంతో అసౌకర్యానికి గురైన అతను మైదానం వీడాడు. దాంతో షమీ మళ్లీ మైదానంలోకి వస్తాడా? బౌలింగ్ చేస్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
షమీ స్థానంలో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా టీమిండియాకు శుభారంభం అందించాడు. దూకుడుగా ఆడుతున్న బాబర్ ఆజామ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఒకవేళ షమీ గాయం తీవ్రమైతే మాత్రం టీమిండియాకు ఎదురు దెబ్బే. ఇప్పటికే వెన్ను గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే.
Injury Scare For Mohammed Shami 🫣
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) February 23, 2025
Was Seen Going Towards Dressing Room pic.twitter.com/Bc4lcSfsno
Mohammed Shami leaving the ground hopefully nothing is serious. pic.twitter.com/pcAcXheXGR
— Ahmed Says (@AhmedGT_) February 23, 2025