For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: గెలిచామని నకరాలు చేస్తే మంచిగుండదు.. పాక్ ఆటగాళ్లకు బాబార్ ఆజామ్ వార్నింగ్!

 IND vs PAK: Babar Azam says no need to go overboard after historic win in T20 WC

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాపై సాధించిన చారిత్రాత్మక విజయంతో ఉప్పొంగిపోవద్దని తన సహచర ఆటగాళ్లకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సూచించారు. ఈ విజయానందంలో నకరాలు చేస్తే బాగుండదని హెచ్చరించాడు. మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్‌ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నాడు. ఒక్క టీమిండియాపైనే గెలవడానికే ఈ మెగా టోర్నీకి రాలేదని, ప్రపంచకప్‌ సాధించేవరకు కష్టపడాలన్నాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్‌ ఆజామ్ తమ ఆటగాళ్లతో సమావేశమయ్యాడు.

నకరాలు చేయవద్దు..

ఈ సందర్భంగా బాబర్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలవడమే తమ లక్ష్యమనే విషయాన్ని మరవద్దని హెచ్చరించాడు. 'భారత్‌పై సాధించిన ఈ విజయాన్ని మనం ఆస్వాదిద్దాం. కానీ, హోటల్‌కు వెళ్లాక మన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్‌ చేసుకుందాం. భారత్‌తో మ్యాచ్‌ అయిపోయింది కదా అని మిగతా మ్యాచ్‌లకు సన్నద్ధమవ్వడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేయండి. కానీ.. జట్టులో మీ పాత్రలేంటో మర్చిపోవద్దు. మనం ఇక్కడ భారత జట్టు ఒక్కదాన్నే ఓడించడానికి రాలేదు. ప్రపంచకప్‌ గెలవడానికి వచ్చాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి' అని బాబర్‌ ఆజామ్ గట్టిగానే చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు(పీసబీ) ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకోగా వైరల్‌గా మారింది.

భారత్‌పై రాణించినట్లే..

భారత్‌పై రాణించినట్లే..

ఈ విజయంపై స్పందించిన ఆ జట్టు మాజీ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించే క్రమంలో అతి చేయొద్దని, ప్రపంచకప్‌ గెలవడానికి ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. అది జరగాలంటే భారత్‌పై చెలరేగినట్లే ప్రతి ఆటగాడు మిగతా మ్యాచ్‌ల్లో రాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది.

 చిత్తయిన కోహ్లీసేన..

చిత్తయిన కోహ్లీసేన..

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' షాహిన్‌ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.

Story first published: Tuesday, October 26, 2021, 15:23 [IST]
Other articles published on Oct 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+