Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఏం గుండెరా అది.. ఒక రోజు ముందే తుది జట్టు ప్రకటన!

క్యాండీ: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే జట్టు వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా.. నేపాల్‌తో ఆరంభ మ్యాచ్‌ ఆడిన టీమ్‌నే కొనసాగించింది. భారత్‌తో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని పాకిస్థాన్ క్రికెట్ ట్వీట్ చేసింది.

నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజామ్(151), ఇఫ్తికర్ అహ్మద్(109 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు. భారత్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని పాకిస్థాన్ భావిస్తోంది. నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు కూడా పాకిస్థాన్ ఒక రోజు ముందుగానే జట్టును ప్రకటించింది.

IND vs PAK: Babar Azam and co announced playing XI a day ahead of India clash in Asia Cup 2023

అదే సంప్రదాయాన్ని భారత్‌తో పోరుకు ముందు కూడా కొనసాగించి తమ ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. గత ఆసియాకప్ టీ20 ఫార్మాట్‌లో జరగగా.. టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు సార్లు దాయాదీ దేశాలు తలపడ్డాయి. వన్డే మ్యాచ్‌లు ఆడకపోవడంతోనే శనివారం జరిగే మ్యాచ్‌లో ఎవరు? ఫేవరేట్ అనేది చెప్పడం కష్టంగా మారింది. గతంలో భారత బ్యాటర్లు, పాకిస్థాన్ బౌలర్ల మధ్యనే పోరు ఉండేది.

అయితే ఈ సారి కూడా అదే రిపీట్ కానుంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీష్ రౌఫ్‌ల బౌలింగ్‌.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌ ప్రదర్శనపై ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2021లో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.

2022 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం అతను దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో డెప్త్ ఉండటం పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫకార్ జమాన్ మినహా అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా బాబర్ ఆజామ్ మంచి జోష్‌లో ఉన్నాడు. రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, నసీమ్ షా వరకు ఆ జట్టు‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది.

మహమ్మద్ నవాజ్ స్థానంలో ఫాహిమ్ అష్రఫ్ తీసుకురావాలని పాకిస్థాన్ భావించినా.. భారత్‌లో ఐదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్ననేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో హై ఓల్టెజ్ మ్యాచ్‌కు కూడా ఒక రోజు ముందుగానే జట్టును ప్రకటించడాన్ని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఏం గుండెరా అది అని కామెంట్ చేస్తున్నారు.

పాకిస్థాన్ తుది జట్టు: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ .

Story first published: Friday, September 1, 2023, 20:33 [IST]
Other articles published on Sep 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+