
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకుంటున్న భారత బౌలర్లు.. పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. పాక్ బ్యాటింగ్ బలంపై దెబ్బకొట్టాడు. ఆ జట్టు ఓపెనర్లు బాబర్ ఆజామ్(0), మహమ్మద్ రిజ్వాన్(0) ఇద్దర్నీ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దాంతో పాక్ పూర్తి ఆత్మ రక్షణలో ఆడుతోంది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే బాబర్ ఆజామ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్.. తన మరుసటి ఓవర్ చివరి బంతికి మహమ్మద్ రిజ్వాన్‌ను క్యాచ్ ఔట్ వెనక్కిపంపాడు. అర్షదీప్ సింగ్ షాట్ బాల్ ప్లాన్‌ను రిజ్వాన్ పసిగట్టలేకపోయాడు. బౌన్సర్‌కు టెంప్ట్ అయ్యి అర్ష్‌దీప్ సింగ్ బుట్టలో పడ్డాడు. దాంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో షాన్ మసూద్(19 బ్యాటింగ్), ఇఫ్తికర్ అహ్మద్(10 బ్యాటింగ్) ఉన్నారు. షాన్ మసూద్‌కు లక్ కలిసొచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అతను రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విరాట్ కోహ్లీ కొట్టిన బంతి వికెట్లకు తాకలేదు. దాంతో అతను బచాయించాడు. భువీ సైతం మూడు ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడే అవకాశాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలిపాడు. పిచ్‌పై గ్రాస్ ఉన్న నేపథ్యంలో బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉందన్నాడు. ఈ అడ్వాంటేజ్‌ను తాము ఉపయోగించాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ మెగా మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని చెప్పిన రోహిత్.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడామని చెప్పాడు. ఇప్పుడు తమ ఆటను ఆస్వాదించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
తమ ఆట కోసం మైదానాలకు వచ్చిన ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరిచామని, అలరిస్తామని నమ్మకం ఉందన్నాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఏడుగురు బ్యాటర్లు, ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇందులో ఒక స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడని తెలిపాడు. తుది జట్టులో పెద్దగా మార్పులు లేకున్నా.. యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే హర్షల్ పటేల్‌కు బదులు మహమ్మద్ షమీని తీసుకున్నారు. అయితే పాకిస్థాన్ జట్టులో లెఫ్టాండర్స్ ఉన్నారనే చాహల్‌కు బదులు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.