Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఒరేయ్ అబ్రార్.. నీ మెడ జాగ్రత్త!(వీడియో)

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో 9వ సారి టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే.. 'ఆపరేషన్ సిందూర్' ఆ ఉగ్రమూక పునాదుల్నే పెకిలించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో తెలుగోడి సత్తాతో ఆపరేషన్ విజయ్ తిలక్‌గా ముగిసింది.

ఈ టోర్నీలో భారత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లకు మూడింటిని పాకిస్థాన్ ఓడిపోయింది. ఆపరేషన్ సిందూర్ అయినా.. క్రికెట్ మ్యాచ్‌ అయినా భారత్‌దే విజయమంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కితాబిచ్చారు. ఈ విజయం నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లను అభిమానులతో పాటు భారత క్రికెటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఔట్ చేసిన అనంతరం పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. 'వెళ్లు.. వెళ్లవయ్యా'అంటూ మెడతో సైగలు చేశాడు. అయితే ఇది అబ్రార్ ట్రెడ్ మార్క్ సెలెబ్రెషన్.

IND vs PAK Arshdeep Singh Jitesh Sharma and Harshit Rana Mock Abrar Ahmed s Neck-Cutting Celebration Video

ఇచ్చిన పడేసిన జితేష్, హర్షిత్, అర్ష్‌దీప్..

వికెట్ తీసినప్పుడల్లా అతను ఇలానే సెలెబ్రేట్ చేసుకుంటాడు. తిలక్ వర్మ-సంజూ శాంసన్‌ల 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని విడదీసిన సంతోషంలో అబ్రార్ అహ్మద్ ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాడు. అయితే సంజూ శాంసన్ మౌనంగానే మైదానం వీడాడు. విజయానంతరం అబ్రార్ అహ్మద్‌కు భారత యువ ప్లేయర్స్ జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు అదిరిపోయే కౌంటరిచ్చారు. సంజూ శాంసన్‌ను ముందు ముగ్గురు నిల్చొని అబ్రార్ అహ్మద్ నెక్ సెలెబ్రేషన్ రీక్రియేట్ చేసి నవ్వుతూ ట్రోల్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఒరేయ్ అబ్రార్.. నీ మెడ జాగ్రత్త'అని సెటైర్లు పేల్చుతున్నారు. రివేంజ్‌ను తీర్చుకోవడంలో భారత్‌ను మించిన జట్టు లేదని కామెంట్ చేస్తున్నారు.రఫెల్ విమానాలు కూలాయని సైగలు చేసిన హరిస్ రౌఫ్‌కు కూడా జస్‌ప్రీత్ బుమ్రా అదిరిపోయే కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. స్టన్నింగ్ యార్కర్‌తో రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. మా రఫెల్ వికెట్ కూల్చిందా? అంటూ సైగలు చేస్తూ సాగనంపాడు.

భారత్‌కు విజయ తిలకం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. లక్ష్యఛేదనలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సిన సమయంలో సిక్స్ బాది విజయాన్ని ఖాయం చేశాడు. ఈ టోర్నీలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకూ సింగ్.. బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, September 29, 2025, 10:49 [IST]
Other articles published on Sep 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+