Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: వైట్ డ్రెస్‌లో మెరిసిన రితికా, అనుష్క.. చీరకట్టులో రివాబా జడేజా!

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ల సతీమణులు హాజరయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సతీమణులు ప్రీతీ నారయణ్, రివాబా జడేజా ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎప్పుడూ ఎడమోహం.. పెడ మోహంగా కనిపించే బాలీవుడ్ స్టార్ హీరోయిన అనుష్క శర్మ, రోహిత్ సతీమణి రితికా సజ్దే.. ఈ మ్యాచ్‌లో పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. పైగా ఇద్దరూ వైట్ డ్రెస్‌ ధరించారు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ఈ ఇద్దరూ కూడా మాట్లాడుకోలేదు.

 IND vs PAK: Anushka Sharma, Ritika Sajdeh and Rivaba Jadeja Spotted In Ahmedabad

మ్యాచ్‌లకు హాజరైనా ఒకరికొకరు దూరం పాటించేవారు. సెలెబ్రిటీ మేనేజర్‌గా పనిచేసిన రితికా సజ్దే గతంలో విరాట్ కోహ్లీ దగ్గర పని చేసింది. ఆ సమయంలో ఈ ఇద్దరూ చాలా చనువుగా ఉండేవారనే ప్రచారం ఉంది. కోహ్లీ మేనేజర్‌గా ఉన్న సమయంలో కలిసి సినిమాలకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య పాస్ట్ రిలేషన్ ఉండటంతోనే అనుష్క శర్మ.. రితికాకు దూరంగా ఉందనే గాసిప్స్ వెలువడ్డాయి.

ఇటీవల కోహ్లీ, రోహిత్ తమ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి చనువుగా ఉండటంతో అనుష్క, రితికా కూడా కలిసిపోయినట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని చూసారు. వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరితో పాటు అశ్విన్ సతీమణి ప్రీతి నారయణ్ మోడర్న్ డ్రెస్స్‌ల్లో బ్లాక్ గాగుల్స్‌తో తళక్కుమనగా.. జడేజా వైఫ్ మాత్రం సంప్రదాయ చీరకట్టులో సాధారణ మహిళలా కనిపించారు.

గుజరాత్ ఎమ్మెల్యే అయిన రివాబా జడేజా.. తాను ఓ ప్రజాప్రతినిధిని అనే విషయాన్ని వస్త్రధారణలో ప్రతిబించించేలా చూసుకుంటారు. చాలా తక్కువగా మ్యాచ్‌లకు హాజరయ్యే ఆమె.. అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ కావడంతో వచ్చారు. ఐపీఎల్ 2023 ఫైనల్‌కు కూడా హాజరైన రివాబా జడేజా.. మ్యాచ్ అనంతరం జడేజా కాళ్లు మొక్కి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38)‌ రెండేసి వికెట్లు తీసారు.

{tweet2}

Story first published: Saturday, October 14, 2023, 19:08 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+