కొలంబో: పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్ మ్యాచ్‌లో అఘా సల్మాన్ రక్తం చిందించాడు. స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి ముక్కు పగలగొట్టుకున్నాడు. హెల్మెట్ లేకుండా ఆడటంతో బంతి అతని ముక్కు పక్క భాగంలో బలంగా తాకింది.
దాంతో అఘా సల్మాన్‌కు రక్తం కారింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని కంటి కింది భాగంలో బలంగా తాకింది. గంటకు 94 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి సల్మాన్ ముఖ చర్మాన్ని కట్ చేసింది. దాంతో రక్తం కారింది. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స చేయగా అతను హెల్మెట్ పెట్టుకొని బ్యాటింగ్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. హెల్మెట్ పెట్టుకోకపోవడంపై ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. స్పిన్ బౌలింగే కదా అని తక్కువ అంచనా వేస్తే రక్తం చిందించుకోవాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా దూసుకెళ్లింది. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇమామ్ ఉల్ హక్(9), బాబర్ ఆజామ్(10), మహమ్మద్ రిజ్వాన్(2), ఫకార్ జమాన్(27), అఘా సల్మాన్(23), షాదాబ్ ఖాన్(6) దారుణంగా విఫలమయ్యారు. ఇఫ్తికర్ అహ్మద్, ఫహీమ్ పరువు కోసం పోరాడుతున్నారు.