Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: కొంపముంచిన అభిషేక్, కుల్దీప్.. 3 క్యాచ్‌లు నేలపాలు!

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఘోర తప్పిదం చేశారు. లడ్డూ లాంటి క్యాచ్‌లను నేలపాలు చేశారు. తొలి ఓవర్‌లోనే పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద్ ఫర్హాన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే ఫర్హాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ అవకాశంతో అతను హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని ఫర్హాన్ భారీ షాట్ ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ బంతిని అంచనా వేయడంలో విఫలమై నేలపాలు చేశాడు. వరుణ్ చక్రవర్తీ వేసిన ఐదో ఓవర్‌లో సైమ్ అయుబ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కుల్దీప్ యాదవ్ వదిలేసాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని సైమ్ అయుబ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. కానీ షార్ట్ ఫైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ బంతిని అందుకోలేకపోయాడు.

IND vs PAK Abhishek Sharma and Kuldeep Yadav Drop Easy Catches in Asia Cup Super 4

ఈ క్యాచ్ పట్టుంటే సైమ్ అయుబ్ 4 పరుగులకే వెనుదిరిగేవాడు. కానీ కుల్దీప్ యాదవ్ చేసిన తప్పిదంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. పవర్ ప్లేలోనే టీమిండియా రెండు కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడంతో చెలరేగిన పాకిస్థాన్.. వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తీ వేసిన 8వ ఓవర్‌లో ఫర్హాన్‌కు మరో లైఫ్ లభించింది. ఈ ఓవర్ మూడో బంతికి అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను అభిషేక్ శర్మ అందుకోలేకపోయాడు. దాంతో అది సిక్సర్‌గా మారింది. ఆ తర్వాత కూడా ఫర్హాన్ భారీ సిక్స్‌లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Sunday, September 21, 2025, 21:03 [IST]
Other articles published on Sep 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+