For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: ధోనీ ఫార్మూలా‌తోనే టీమిండియాను గట్టెక్కించిన విరాట్ కోహ్లీ.. ఉచ్చులో పడిన పాక్!

IND vs PAK 2022: Virat Kohli and Hardik Pandya did what MS Dhoni used to do and took it deep

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచం మెచ్చిన పాక్ పేసర్లను పరేషాన్ చేస్తూ.. మెల్‌బోర్న్‌లో తిరుగులేని మొనగాడిగా విరాట్ అద్భుత విజయాన్నందించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. హార్దిక్ ఔటైనా.. కడవరకు క్రీజులో నిల్చొని విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ధోనీ ఫార్మూలాతో..

ధోనీ ఫార్మూలాతో..

అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫార్మూలాను ఉపయోగించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తన హాయంలో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లేవాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. ఆఖరి వరకు పోరాడాలనే చెప్పేవాడు. తాను పాటించేవాడు. లక్ష్యానికి సమీపిస్తున్న వేళ ఎంతటి మేటి బౌలర్లు అయినా ఒత్తిడికి లోనై తప్పిదాలు చేస్తారని, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని యువ ఆటగాళ్లకు పదేపదే చెప్పేవాడు. ప్రాక్టీకల్‌గా ఎన్నో గేమ్స్‌లో తాను కడవరకు నిలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనలే దీనికి ఓ మంచి ఉదహారణ.

ఎలాంటి ఒత్తిడి లేకుండా..

ఎలాంటి ఒత్తిడి లేకుండా..

హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కూడా ధోనీ చెప్పిన ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇటీవల హార్దిక్ సైతం ధోనీ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగత స్కోర్ చూడకుండా.. జట్టు స్కోర్ చూసి ఆడాలని ధోనీ చెప్పేవాడని, ఆ మాట తనకు ఇంకా గుర్తుందని తెలిపాడు. జట్టు స్కోర్‌ను చూసి ఆడితే మ్యాచ్‌లోని జట్టు పరిస్థితి బాగా అర్థమవుతుందని, పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో తెలుస్తుందనేది ధోనీ వ్యూహం. ఇదే ఫార్మూలాను హార్దిక్, విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో ఉపయోగించారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. 10 ఓవర్లకు 45 పరుగులే చేసినా.. చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉన్నా... ఏ మాత్రం జంకలేదు.

ధోనీ సూత్రానికి కట్టుబడి..

ధోనీ సూత్రానికి కట్టుబడి..

ఒత్తిడికి గురవ్వలేదు. ధోనీ ఫార్మూలాకు కట్టుబడి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మంచి బాల్స్ గౌరవిస్తూ చెత్త బంతులనే బౌండరీలకు తరలించారు. 19వ ఓవర్‌లో మ్యాచ్ చేజారుతున్న సమయంలో విరాట్ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దాంతో భారత్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా.. పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి బంతికి హార్దిక్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. రెండో బంతికి సింగిల్ తీయడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.

పని చేసిన ప్రాథమికి సూత్రం..

పని చేసిన ప్రాథమికి సూత్రం..

ఇక కోహ్లీని చూసి భయపడ్డ మహమ్మద్ నవాజ్ ఫుల్‌టాస్ వేయగా.. దాన్ని విరాట్ సిక్సర్‌గా మలిచాడు. అదికాస్త నోబాల్ కావడం.. ఆ తర్వాత మరింత ఒత్తిడికి గురైన నవాజ్ వైడ్లు వేయడం.. ఫ్రీహిట్ బాల్ అనే సోయి లేకుండా ఉండిపోవడం చక చక జరిగిపోయాయి. ఇవన్నీ టీమిండియా లక్ కంటే.. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం వల్లే జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ ఫార్మూలాతో విరాట్ కోహ్లీ బిగించిన ఉచ్చులో పాక్ ఆటగాళ్లు చిక్కుకున్నారు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం ధోనీ ఫార్మూలాతోనే విరాట్, హార్దిక్ ఆడారని తెలిపాడు.

Story first published: Monday, October 24, 2022, 17:45 [IST]
Other articles published on Oct 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+