For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final Day3 Review: టీమిండియా వైఫల్యానికి కారణాలు ఇవే!

Ind vs Nz WTC Final 2021: Reasons For Indias Failure On Day 3
WTC Final: పేస్ ఆల్‌రౌండర్ ఉంటే ? |పేలవ షాట్‌తో Pant, Rahane Like Toy || Oneindia Telugu

సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ పేస్‌ పదునుకు భారత్‌ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్‌ పేసర్ కైల్‌ జేమీసన్‌ (5/31) నిప్పులు చెరగడంతో భారత్‌ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్‌ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. అజింక్యా రహానే (190 బంతుల్లో 5 ఫోర్లు 49 ), కోహ్లీ (196 బంతుల్లో 1 ఫోర్‌‌తో 44 ) రాణించారు.

బౌల్ట్, వాగ్నర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్‌ దక్కింది. అయితే మూడో రోజు ఆటలో భారత వైఫల్యానికి గలకారణాలు తెలుసుకుందాం.

కోహ్లీ వికెట్ టర్నింగ్ పాయింట్..

కోహ్లీ వికెట్ టర్నింగ్ పాయింట్..

సెకండ్ డే సూపర్ బ్యాటింగ్‌తో అందరి చేత శభాష్ అనిపించుకున్న కోహ్లీ.. మూడో రోజు ప్రారంభంలోనే ఔటయ్యాడు. కైల్ జెమీసన్ అద్భుతమైన బంతికి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. వాస్తవానికి కోహ్లీ కొంత కంగారుగా కనిపించాడు. కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఆడిన అతను.. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు.

అప్పటి వరకు అన్ని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బాల్స్ వేసిన జెమీసన్ ఒక్కసారి వికెట్ల మీదకు బంతిని వేసి ఫలితం రాబట్టాడు. వికెట్ల వైపు దూసుకొచ్చిన బంతిని విరాట్ అంచనా వేయలేక ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. అప్పటి వరకు జెమీసన్ 15.4 ఓవర్లు వేయగా ఇందులో వికెట్ల మీదుకు సంధించిన బాల్స్ ఏడే ఏడు. ఏడో బంతికే విరాట్ కోహ్లీ వికెట్ రాబట్టాడు. ఈ వికెటే మూడో రోజు ఆటలో టర్నింగ్ పాయింట్ అయింది. కోహ్లీ గనుకు ఔట్ కాకుండా ఉంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది.

రిషభ్ పంత్ చెత్త షాట్..

రిషభ్ పంత్ చెత్త షాట్..

కోహ్లీ ఔటైన వెంటనే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్ పేలవ షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. ఈ వికెట్ కూడా భారత్ పతనాన్ని శాసించింది. వరుసగా ఏడు ఓవర్ల మెయిడిన్ అవ్వడం‌తో భారత బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఒత్తిడి లోనయ్యారు. ఓ వైపు బౌల్డ్.. మరోవైపు జెమీసన్ నిప్పులు చెరిగే బంతులతో దాడి చేశారు. జెమీసన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బౌండరీ రాబట్టిన పంత్ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు.

కానీ ఆ వెంటనే జెమీసన్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని షాట్‌కు ప్రయత్నించిన పంత్.. స్లిప్‌లో లాథమ్‌కు చిక్కాడు. అప్పటి వరకు అలాంటి బంతులన్నీ వదిలేసిన పంత్.. నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ జెమీసన్ స్మార్ట్‌గా బౌలింగ్ చేశాడు. బౌండరీతో పంత్‌ను టెంప్ట్ చేసి బోల్తా కొట్టించాడు. పంత్ ఆ బంతిని వదిలేసి ఉంటే.. రహానే‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం దక్కేది.

కివీస్ ట్రాప్‌లో రహానే..

కివీస్ ట్రాప్‌లో రహానే..

కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి గట్టెక్కించే బాధ్యతను రహానే తీసుకున్నాడు. అడపా దడపా బౌండరీలు, సింగిల్స్‌తో స్కోర్ బోర్డును ఈ జోడి పరుగెత్తించింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన రహానేను కివీస్ అద్భుతవ్యూహంతో బోల్తా కొట్టించింది. వాగ్నర్ వేసిన 79వ ఓవర్‌లో మూడో బంతిని షార్ట్ బాల్ వేయగా.. రహానే ఫుల్లర్ షాట్ ఆడాడు. అది కాస్త గాల్లోకి లేచి ఫీల్డర్ లేని చేతిలో పడింది. దాంతో రెండు పరుగులు రాగా.. రహానే 49 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాంతో అతను హాఫ్ సెంచరీ కోసం ప్రయత్నిస్తాడని భావించిన విలియమ్సన్.. స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టాడు.

వాగ్నర్ మరోసారి షార్ట్ బాల్ వేయగా.. ఆడలా వద్దా? అనే సందిగ్దంలో పేలవ షాట్ ఆడిన రహానే.. నేరుగా లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే సింగిల్ తీయాలనే ఆలోచనలో రహానే ఆడినట్లున్నాడని కామెంటేర్లు పేర్కొన్నారు. ఆ బంతిని రహానే వదిలేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వికెట్‌తో భారత్ పతనం మొదలైంది.

వరుస బంతుల్లో..

వరుస బంతుల్లో..

క్రీజులోకి వచ్చిన అశ్విన అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోర్‌ను 200 ధాటించినా పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇషాంత్ కొంతసేపు క్రీజులో నిలదొక్కుకున్నా.. జెమీసన్ వరుస బంతుల్లో అతన్ని, బుమ్రాను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా గోల్డెన్ డక్ అవ్వడం కూడా భారత్‌కు చేటు చేసింది. అతను కనీసం 15 బంతులాడి ఉంటే జట్టు స్కోర్ మరో 10-15 రన్స్ వచ్చేవి.

దాంతో ఒత్తిడికి లోనైన జడేజా సైతం వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఇక్కడ ఓ పేస్ ఆల్‌రౌండర్ ఉంటే భారత్‌కు మేలు చేసేదేమో. ఆ తర్వాత బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఎట్టకేలకు ఓపెనర్ల వికెట్ తీసినా ఆలస్యమైంది. అయితే బ్యాడ్ లైట్ కారణంగా అర గంట ముందే మ్యాచ్ ముగియడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. మరో 10 ఓవర్ల మ్యాచ్ జరుగుంటే కచ్చితంగా ఇంకో వికెట్ లభించేది.

Story first published: Monday, June 21, 2021, 15:26 [IST]
Other articles published on Jun 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+