IND vs NZ: రోహిత్ శర్మను ఓపెనర్‌గా ఆడించరా? అందుకే కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాదనేది!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా అదే తడబాటును కొనసాగిస్తోంది. 48 పరుగులకే టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో గౌరవ ప్రదమైన స్కోర్ కోసం భారత జట్టు పాకులాడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. రోహిత్ శర్మకు బదులు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్(4) దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(18), రోహిత్ శర్మ(14), కోహ్లీ(9) దారుణంగా విఫలయ్యారు. అయితే రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ట్వీటర్ వేదికగా కెప్టెన్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద నేరం..
కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఓపెనింగ్ చేయించకపోవడం పెద్ద నేరమని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్‌ను ఓపెనేర్‌గా ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మరో అభిమని ట్వీట్ చేశాడు. ఇదో పనికిమాలిన నిర్ణయమని, అందుకే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా రాకపోవడం చికాకు గురి చేస్తుందని ఇంకొందరు కామెంట్ చేస్తూన్నారు. మొత్తానికి టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ఈ ప్రయోగం మిస్ ఫైర్ అయ్యింది. ఆరంభంలోనే వికెట్లు పడటంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది.
వరుసగా 9వ సారి..
దుబాయ్ పిచ్‌పై టాస్ చాలా కీలకమనే విషయం అందరికి తెలిసిందే. ఈ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి ఫీల్డింగ్ చేసిన జట్లే విజయాన్నందుకున్నాయి. పాక్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లోనూ టాస్ కీలకమైంది. సెకండ్ బ్యాటింగ్ చేసే సమయంలో మంచు ప్రభావం ఉంటుండటంతో బౌలర్లకు కష్టమవుతోంది. బంతి జారుతుండటంతో బ్యాట్స్‌మన్‌కు సులువవుతుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ మంచు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే భారత్ టాస్ గెలవడం ముఖ్యమని అంతా భావించారు. కానీ విరాట్ కోహ్లీని మళ్లీ దురదృష్టం వెక్కిరించింది. దాంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్.. మూల్యం చెల్లించుకుంది. ఇక విరాట్ కోహ్లీ వరుసగా 9సార్లు టాస్ ఓడిపోవడం గమనార్హం.

కోహ్లీకి శని పట్టింది..
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి ఈ మధ్య ఏది కలిసిరావడం లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ కెటిల్ బరో కూడా భారత్ పతనానికి ఓ కారణమంటున్నారు. అతను అంపైరింగ్ చేసిన ఐసీసీ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. భారత్ ఓటమిపాలైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు తమ అసహనాన్నివ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications