టీమిండియా స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ భారత తుది జట్టు నుంచి వేటుకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ సిరాజ్‌ను పక్కనపెట్టేసింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సిరాజ్ దారుణంగా విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.
సిరాజ్ స్థానంలో యువ పేసర్ ఆకాశ్‌దీప్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈ మార్పు అందరూ ఊహించినదే. ఎందుకంటే సొంతగడ్డపై సిరాజ్ ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. ఈ ఏడాది పూర్తిగా ఫామ్ కోల్పోయిన సిరాజ్.. టెస్ట్‌ల్లో చెత్త గణంకాలు నమోదు చేశాడు. అయితే సిరాజ్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తరుచూ అతనికి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పిస్తుండటం.. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే రిథమ్ కోల్పోయేలా చేసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. కేవలం 6 వికెట్లు మాత్రమే తీసాడు. సొంతమైదానం అయిన హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వగా.. మూడో టెస్ట్ తొలి టెస్ట్‌లో రెండు వికెట్లు తీసాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయలేదు.
రాంచీ టెస్ట్‌లోనూ రెండు వికెట్లు తీసిన సిరాజ్.. ధర్మశాల టెస్ట్‌లో ఒక్క వికెట్ సాధించలేదు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఆకాశ్‌దీప్ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో జట్టులోకి వచ్చాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో 9 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు.