న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! (వీడియో)

IND vs NZ: Washington Sundar takes magnificent catch off his own bowling to dismiss Mark Chapman

రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో మైమరిపించాడు. అచ్చం చేప పిల్లలానే పుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో బంతిని ఒడిసి పెట్టుకున్నాడు. సుందర్ సూపర్ క్యాచ్‌కు న్యూజిలాండ్ బ్యాటర్ చాప్‌మన్(0) నోరెళ్ల బెట్టాడు. ఇదెక్కడి ఫీల్డింగ్ రా అయ్యా అంటూ డకౌటై తల బాదుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా.. సుందర్‌పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇదో అత్యుత్తమ రిటర్న్ క్యాచ్ అని కొనియాడుతున్నారు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతికి డేంజరస్ ఫిన్ అలెన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35)‌ను క్యాచ్‌ ఔట్‌తో పెవిలియన్ చేర్చి బ్రేక్ త్రూ అందించిన సుందర్.. చివరి బంతికి సూపర్ డైవ్‌తో చాప్‌మన్‌ను ఔట్ చేసి భారత అభిమానుల ఆనందాన్ని రెండింతలు చేశాడు.

సుందర్ ఈ బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ట్ సంప్ దిశగా వేయగా.. చాప్‌మన్ బౌలర్ వైపు పుష్ చేస్తూ డిఫెన్స్ ఆడాడు. అప్రమత్తమైన సుందర్ తన కుడివైపు సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. థర్డ్ అంపైర్ రిప్లే పరిశీలించి క్లీన్ క్యాచ్‌ అని ఔటిచ్చాడు. దాంతో న్యూజిలాండ్ 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మరుసటి ఓవర్‌ను హుడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 47 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్‌తో కలిసి డెవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

Story first published: Friday, January 27, 2023, 20:07 [IST]
Other articles published on Jan 27, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X