Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: వాష్టింగ్టన్ సుందర్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన రచిన్ రవీంద్ర (వీడియో)

టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కళ్లు చెదిరే బంతితో ఔరా అనిపించాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ డెలివరీతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు. సుందర్ సూపర్ బాల్‌ను పసిగట్టలేకపోయిన రచిన్ రవీంద్ర మూల్యం చెల్లించుకున్నాడు. తాను ఔటైన విషయాన్ని నమ్మలేకపోయాడు.

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 60వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ తొలి బంతిని సుందర్ ఆఫ్ స్టంప్‌లో వేయగా.. రచిన్ రవీంద్ర ఫ్రంట్‌ ఫూట్‌లో డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అద్భుతంగా లోపటికి టర్న్ అయ్యి బ్యాట్‌ను మిస్సై వికెట్లను పడేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి రచిన్ రవీంద్ర నోరెళ్లబెట్టాటు. బంతి ఎలా? మిస్సయ్యిందనే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

IND vs NZ Washington Sundar dismiss in-form Rachin Ravindra With an absolute ripper Video

తన మరసటి ఓవర్‌లోనూ సుందర్ ఇదే తరహా బంతితో క్రీజులోకి వచ్చిన టామ్ బ్లండేల్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 62వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని వాషింగ్టన్ సుందర్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బ్లండెల్ లెగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి.. అతని బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి వికెట్లను లేపేసింది.

ఈ వికెట్ల అనంతరం అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించగా.. న్యూజిలాండ్ 62 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65), డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు వికెట్లు తీగాయ.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Thursday, October 24, 2024, 14:44 [IST]
Other articles published on Oct 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+