For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: వాహ్ అన్న వాహ్ వాటే బాల్.. నోరెళ్లబెట్టిన రచిన్ రవీంద్ర!(వీడియో)

టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ మరోసారి కళ్లు చెదిరే బంతితో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే(7/59) ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చిన సుందర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(9)ను రెండో సారి పెవిలియన్ చేర్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లోనూ కళ్లు చెదిరే రిప్పర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన సుందర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన లెంగ్త్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. సుందర్ సూపర్ బాల్‌కు రచిన్ రవీంద్ర నోరెళ్లబెట్టాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ వేసిన 22వ ఓవర్‌లో ఈఘటన చోటు చేసుకుంది.

IND vs NZ Washington Sundar cleans up Rachin Ravindra for the second time video goes viral

ఈ ఓవర్ ఐదో బంతిని సుందర్ గుడ్ లెంగ్త్‌లో వేయగా.. రచిన్ రవీంద్ర బ్యాక్‌ఫుట్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. స్టంప్ లైన్‌లో ఉన్న బంతిని కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రచిన్ ఘోర తప్పిదం చేశాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్లను లేపేసింది. అనూహ్యమైన బౌన్స్ ఉన్న వికెట్‌పై రచిన్ రవీంద్ర నిర్లక్ష్యంగా కట్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వాహ్ అన్న వాహ్ వాటే బాల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

103 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు రాబడుతోంది. 27 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. టామ్ లాథమ్(49 బ్యాటింగ్), మిచెల్ సాంట్నర్(15) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(30), విరాట్ కోహ్లీ(1), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11),రవిచంద్రన్ అశ్విన్(4), రవీంద్ర జడేజా(38), ఆకాశ్‌దీప్(6), జస్‌ప్రీత్ బుమ్రా(0)లు దారుణంగా విఫలమయ్యారు. రెండు రోజు ఆటలో టీమిండియా 140 పరుగులు చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.

Story first published: Friday, October 25, 2024, 15:12 [IST]
Other articles published on Oct 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+