టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాయం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల విషయంలో రోహిత్ శర్మకు కోహ్లీ పలు సూచనలు చేశాడు. అతను ఇచ్చిన సలహాను పాటించి రోహిత్ శర్మ ఫలితాన్ని రాబట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేశాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర భారీ షాట్స్ ఆడాడు. దాంతో ఈ జోడీ ప్రమాదకరంగా మారింది. అప్పటికే రచిన్ రవీంద్ర ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడు.

ఈ జోడీని విడదీసేందుకు ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఫీల్డ్ సెటప్‌లో మార్పులు చేయాలని చెప్పడంతో పాటు వరుణ్ చక్రవర్తీని బౌలింగ్‌కు తీసుకురావాలని సూచించాడు. ఏడో ఓవర్‌కు ముందు రోహిత్-కోహ్లీ మాట్లాడుకోవడం కనిపించింది. కోహ్లీ సలహాలను పాటించిన రోహిత్.. ఆ మరుసటి ఓవర్‌నే వరుణ్ చక్రవర్తీకి అందించడంతో పాటు ఫీల్డ్ సెటప్‌లో మార్పులు చేశాడు.
వరుణ్ చక్రవర్తీ వేసిన ఏడో ఓవర్‌లో రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. కానీ అదే ఓవర్‌లో విల్ యంగ్‌ను ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తీ.. తొలి వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. విరాట్ కోహ్లీ వ్యూహంతోనే విల్ యంగ్ వికెట్ దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
పవర్ ప్లే అనంతరం కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో డేంజరస్ రచిన్ రవీంద్రతో పాటు కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడిన టామ్ లాథమ్‌ను జడేజా ఔట్ చేయగా.. గ్లేన్ ఫిలిప్స్‌తో కలిసి డారిల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 57 పరుగుల భాగస్వామ్యం అనంతరం ఫిలిప్స్‌ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు.
— Rahul ® ⎷ (@RahulSadhu009) March 9, 2025