IND vs NZ: చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ.. గంగూలీ రికార్డ్ బద్దలు!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇది కోహ్లీకి 309వ వన్డే కాగా.. సౌరవ్ గంగూలీ 308 వన్డేలు ఆడాడు.
భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా.. 347 వన్డేలతో మహేంద్ర సింగ్ ధోనీ, 340 మ్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్, మహమ్మద్ అజారుద్దీన్(334) కోహ్లీ కంటే ముందున్నారు.

అత్యధిక అంతర్జాతీయ వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు
- సచిన్ టెండూల్కర్ -463 మ్యాచ్‌లు
- ఎంఎస్ ధోనీ-347 మ్యాచ్‌లు
- మహమ్మద్ అజారుద్దీన్-334 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ-309 మ్యాచ్‌లు
- సౌరవ్ గంగూలీ-308 మ్యాచ్‌లు
సుదీర్ఘ కాలం నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించాడు. అత్యధిక వన్డే సెంచరీలు బాదిన బ్యాటర్‌గాను రికార్డ్ అందుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగితే మహమ్మద్ అజారుద్దీన్(334) రికార్డ్‌ను అధిగమించే అవకాశం ఉంది. కొత్త ఏడాది టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్, మ్యాచ్ ఇదే కావడంతో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ ఉంది. గెలుపుతో ఈ ఏడాదిని ప్రారంభించాలనుకుంటుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమిండియా ఈ మ్యాచ్ బరిలోకి దిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications