For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: విరాట్ కోహ్లీ లాంగ్ లీవ్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరం!

IND vs NZ: Virat Kohli Goes On Long Leave And Out Of New Zealand Test Series
IND Vs NZ సిరీస్‌కు నాకు లాంగ్ లీవ్ కావాలి..! -Virat Kohli || Oneindia Telugu

న్యూఢిల్లీ: తీరికలేని షెడ్యూల్‌, టీ20 ప్రపంచకప్‌లో టీమ్ దారుణ వైఫల్యంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నాడు. మానసిక ప్రశాంతత కోసం కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండి కుటుంబంతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసిన విరాట్.. లాంగ్ లీవ్ కావాలని కోరాడట. ఈ విరామ సమయాన్ని సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికాతో పాటు కుటుంబ సభ్యులతో ఆస్వాదించాలనుకుంటున్నాడట. గత 6 నెలలుగా బయో బబుల్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)నే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి మినహాయించి విశ్రాంతి కల్పించాలని భావిస్తోంది.

విరాట్ లాంగ్ లీవ్..

విరాట్ లాంగ్ లీవ్..

అయితే ఈ విరామం తనకు సరిపోదని భావించిన కోహ్లీ.. టెస్ట్ సిరీస్‌‌లోని తొలి మ్యాచ్‌కు కూడా దూరంగా ఉంటానని చెప్పాడట. ఇక కోహ్లీ లాంగ్ లీవ్‌కు బీసీసీఐ ఆమోదం తెలపడంతో అతను న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కే అందుబాటులోకి రానున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే విరాట్ కోహ్లీ చెప్పిన నేపథ్యంలో తదుపరి సారథిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టడం లాంఛనమైంది.

అతనికి డిప్యూటిగా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. అయితే రాహుల్ సైతం గత కొంతకాలంగా విరామం లేకుండా ఆడుతుండటంతో అతనికి కూడా విశ్రాంతినిచ్చే చాన్స్ ఉంది. అదే జరిగితే టీమ్‌లో ఉండే మరో సీనియర్ ప్లేయర్ తాత్కలికంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

పాండ్యా, వరుణ్‌పై వేటు..

పాండ్యా, వరుణ్‌పై వేటు..

ఇక కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫస్ట్ టెస్ట్‌కు కూడా రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. అతనికి డిప్యూటిగా రెగ్యూలర్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఉండనున్నాడు. నవంబర్ 17 నుంచి జైపూర్, రాంచీ, కోల్‌కతా వేదికగా మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. కాన్పూర్, ముంబై వేదికగా రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రిషభ్ పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన వరుణ్ చక్రవర్తీతో పాటు హార్దిక్ పాండ్యాపై వేటు పడనుంది. వీరి స్థానాల్లో ఐపీఎల్‌లో సత్తాచాటిన హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్‌కు చోటు దక్కనుంది. కజిన్స్ రాహుల్ చాహర్, దీపక్ చాహర్‌లు కూడా ఈ సిరీస్‌కు ఎంపికవ్వనున్నారు. ఈ సిరీస్‌తోనే రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ శర్మతో కలిసి టీ20 ప్రపంచకప్ 2022నే లక్ష్యంగా ప్రణాళికలు రచించనున్నారు.

విరాట్ తీసుకునేది లీవ్ మాత్రమే..

విరాట్ తీసుకునేది లీవ్ మాత్రమే..

ఇక విరాట్ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో ఎక్కువగా ఊహించుకోవద్దని కూడా బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. రెండో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉంటాడని, కెప్టెన్‌గా జట్టును నడిపిస్తాయని పేర్కొన్నాయి. టెస్ట్‌ల్లో అతని సారథ్యంలో టీమిండియా అద్భుత ఫలితాలు సాధించిందని గుర్తు చేశాయి. ఇక రిషభ్ పంత్‌కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే.. టెస్ట్‌లకు వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్‌లకు చోటు దక్కనుంది.

అయితే యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని భావిస్తే కేఎస్ భరత్‌కు చోటు దక్కవచ్చు. ఒకవేళ రిషభ్ పంత్ జట్టులో ఉన్నా అతని బ్యాకప్‌లో భరత్‌ను తీసుకునే చాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ లేని నేపథ్యంలో ఈ ఫార్మాట్ కెప్టెన్సీ విషయాన్ని సెలెక్టర్లు పక్కనపెట్టనున్నారు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Tuesday, November 9, 2021, 18:19 [IST]
Other articles published on Nov 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+