IND vs NZ: మరింత డేంజరస్‌గా ఉమ్రాన్ మాలిక్.. న్యూజిలాండ్‌కు దబిడి దిబిడే!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో సెమీఫైనల్‌కే పరిమితమైన టీమిండియా.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు కివీస్ పర్యటకు వెళ్లింది. నవంబర్ 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. సీనియర్ ఆటగాళ్లంతా ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక తన పేస్‌తో సెన్సేషన్‌గా నిలిచిన జమ్ము కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
అయితే 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగల ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో వేరియేషన్స్ లేకపోవడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్‌కు తీసుకోకుండా పక్కనపెట్టాడు. దాంతో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినా రెండు, మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.

ఉమ్రాన్ 2.0
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఉమ్రాన్ మాలిక్ సిద్దమవుతున్నాడని జమ్మూ కశ్మీర్ ఫీల్డింగ్ కోచ్ తన్మయ్ శ్రీవాత్సవ తెలిపాడు. ముఖ్యంగా యార్కర్లు వేయడంపై ఉమ్రాన్ మాలిక్ ఫోకస్ పెట్టాడని, బౌలింగ్ వేరియషన్స్ కూడా నేర్చుకుంటున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ 2.0ను చూస్తామని చెప్పాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఈ మాజీ అండర్19 ప్లేయర్.. ఉమ్రాన్ మాలిక్‌ను ఎదుర్కోవడం న్యూజిలాండ్ బ్యాటర్లకు కష్టమేనన్నాడు.

యార్కర్లపై ఫోకస్..
'ఉమ్రాన్ మాలిక్ చాలా ఓపెన్ మైండేడ్. నెట్స్‌లో ప్రతీ ఒక్కరితో మాట్లాడుతాడు. అతను యార్కర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బీసీసీఐ కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. ఎన్‌సీఏలో ప్రత్యేక ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చింది. అంతర్జాతీయలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అతను చాలా నేర్చుకోగలడు. జట్టు తరఫున అద్భుతాలు కూడా సృష్టించగలడు. ఐపీఎల్‌లో 154 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్.. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో మాత్రం 145 కిలోమీటర్ల వేగంతోనే బంతులు సంధించాడు.

కీపర్లు భయపడ్డారు..
దాంతో అతని బౌలింగ్ ప్రభావం కనబడలేదు. కానీ న్యూజిలాండ్ పర్యటనలో మనం ఉమ్రాన్ 2.0ను చూస్తాం. ఉమ్రాన్ మంచి అథ్లెట్. నేను ఇప్పటి వరకు అతనిలా వేగంగా బౌలింగ్ చేసే మరో బౌలర్‌ను చూడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని బౌలింగ్‌లో కీపింగ్ చేయాలంటే కీపర్లు భయపడ్డారు. వేగంగా వేయడం అతనికి సహజసిద్దంగా వచ్చింది. ఆడుతున్నా కొద్దీ అతను మరింత మెరగవ్వనున్నాడు.'అని శ్రీవాత్సవ తెలిపాడు. 150 కిలోమీటర్ల వేగంతో యార్కర్లు సంధిస్తే ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా కష్టమేనని, గాయపడే అవకాశాలు కూడా ఉంటాయన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఈ సీన్స్ చూడబోతున్నామని చెప్పాడు.

న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన భారత టీ20 టీమ్
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర కుమార్, ఉమ్రాన్ మాలిక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications