IND vs NZ: చెలరేగిన అక్షర్ పటేల్.. భారత్‌కు స్వల్ప ఆధిక్యం! మూడో రోజు మనదే!

కాన్పూర్: అక్షర్ పటేల్(5/62) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ కమ్ బ్యాక్ చేసింది. రెండో రోజు పూర్తిగా విఫలమైన టీమిండియా.. మూడో రోజు దుమ్మురేపింది. సూపర్ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ చేసి 49 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ కివిస్ పతనాన్ని శాసించగా.. రవిచంద్రన్ అశ్విన్(3/82) మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఉమేశ్ యాదవ్(1/50), రవీంద్ర జడేజా(1/57) చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 5 ఓవర్లలో 14 పరుగులు చేసింది.

శ్రీకర్ భరత్ స్టన్నింగ్ క్యాచ్‌తో..
అంతకుముందు 129/0 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్(214 బంతుల్లో 15 ఫోర్లతో 89, కెప్టెన్ కేన్ విలియమ్సన్(64 బంతుల్లో 18) వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సూపర్ క్యాచ్‌కు విల్ యంగ్ వెనుదిరగ్గా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(11)తో కలిసి మరో ఓపెనర్ లాథమ్ మరోవికెట్ పడకుండా ఆచితూచి ఆడాడు. దాంతో కివీస్ 197/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
చెలరేగిన అక్షర్..
ఇక సెకండ్ సెషన్ ప్రారంభమైన వెంటనే అక్షర్ పటేల్.. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను పెవిలియన్ చేర్చాడు. సూపర్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్(2)ను అక్షర్ తన మరుసటి ఓవర్‌లో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. నికోల్స్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి టామ్ బ్లండెల్‌తో టామ్ లాథమ్ ఆచితూచి ఆడాడు. అయితే సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ సూపర్ బాల్‌తో ఔట్ చేశాడు. స్టెప్ ఔటై ఆడే ప్రయత్నం చేసిన అతన్ని స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో లాథమ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. క్రీజలోకి వచ్చిన రచిన్ రవీంద్ర(13) జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో కివీస్ 249/6తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
అక్షర్, అశ్విన్ చెలరేగి..
మూడో సెషన్ ఆరంభంలోనే టామ్ బ్లండెల్(13), టీమ్ సౌథీలను 12 పరుగుల వ్యవధిలోనే అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో కైల్ జెమీసన్ ఒంటరి పోరాటం చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. అతనికి అశ్విన్ బ్రేక్ వేశాడు. టెంప్టింగ్ బాల్‌తో ఊరించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వ్యూహాన్ని అంచనా వేయడంలో విఫలమైన జెమీసన్ భారీ షాట్‌కు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ కొద్దిసేపటికే విలియమ్ సోమర్‌విల్లే(6)ను అశ్విన్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్‌కు షాక్..
49 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. జెమీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), మయాంక్ అగర్వాల్(4 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆటను ముగించారు. ప్రస్తుతం భారత్ 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే రేపు మొత్తం బ్యాటింగ్ చేసి 350 ప్లస్ టార్గెట్ విధిస్తే చివరి రోజు న్యూజిలాండ్‌పై ఒత్తిడి క్రియేట్ చేయవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications