IND vs NZ T20 WC: ఆ సిరీస్ ప్రదర్శనను రిపీట్ చేస్తే భారత్‌దే విజయం! రాహుల్‌పైనే ఆశలు!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా జరిగే క్వార్టర్ ఫైనల్‌లాంటి చావో రేవో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్ రేసులో ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కివీస్‌పై టీమిండియాకు ఉన్న చెత్త రికార్డు ఇప్పుడు అందర్నీ కలవరపాటుకు గురి చేస్తోంది. ఐసీసీ టోర్నీల్లో గత 13 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై భారత్ గెలవలేదు. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి మొన్నటి టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వరకు అన్నింటీలోనే భారత్‌కు చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో ఓ సిరీస్ ఫలితం భారత అభిమానులకు ఆశలను కలిగిస్తోంది. అదంటేంటే గతేడాది ప్రారంభంలో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 5-0తో క్వీన్ స్వీప్ చేసింది. ఈ ఐదు టీ20ల మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లకు దారితీసినా భారత్‌నే విజయం వరించడం విశేషం. ఇప్పుడు అదే తరహా ప్రదర్శనను తాజా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రిపీట్ చేయాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఐదు టీ20ల సిరీస్‌పై ఓ లుక్కెద్దాం.

రాహుల్ సూపర్ పెర్ఫామెన్స్..
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఓపెనర్ రోహిత్ (7) విఫలమైనా రాహుల్ (56), కెప్టెన్ కోహ్లీ (45), శ్రేయస్ అయ్యర్ (58) రాణించారు.
దాంతో భారత్ సిరీస్‌లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఈసారి 132/5 తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం రోహిత్ (8), కోహ్లీ (11) విఫలమైనా రాహుల్ (57 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (44) మ్యాచ్‌ను గెలిపించారు.

రెండు సూపర్ ఓవర్లు...
ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేన తర్వాతి రెండు మ్యాచ్‌లను సూపర్ ఓవర్లో కైవసం చేసుకోవడం గమనార్హం. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 179/5 స్కోర్ చేసింది. రోహిత్ (65) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతనికి రాహుల్ (27), కోహ్లీ (38)ల నుంచి మంచి సహకారం లభించింది.
అనంతరం న్యూజిలాండ్ విలియమ్సన్ (95) వీరోచిత బ్యాటింగ్‌తోఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో విలియమ్సన్, గప్తిల్ ధాటిగా ఆడి 17 పరుగులు సాధించారు. అనంతరం రోహిత్, రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చి నెమ్మదిగా ఆడారు.
తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులే చేశారు. ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ హిట్‌మ్యాన్ రెండు సిక్సులు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

మెరిసిన పాండే..
టీమిండియా నాలుగో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 165/8 మంచి స్కోరే సాధించింది. ఈసారి రోహిత్ విశ్రాంతి తీసుకోగా రాహుల్ (39)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ (8) విఫలమయ్యాడు. ఆపై కోహ్లీ (11), శ్రేయస్ (1), శివమ్ దూబె(12) సైతం పరుగులు చేయలేకపోయారు. మనీశ్ పాండే (50) చివరివరకూ క్రీజులో ఉండి జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు.
అయితే, చేజింగ్‌లో గప్తిల్ (4) విఫలమైనా మన్రో (64), సీఫర్ట్ (57) దంచికొట్టారు. మధ్యలో రాస్‌టేలర్ (24) కాసిన్ని పరుగులు చేశాడు. చివరికి మ్యాచ్ టైగా మారి వరుసగా రెండో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. ఇక మరోసారి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన బుమ్రా 13 పరుగులిచ్చాడు. సీఫర్ట్, మన్రో ధాటిగా ఆడారు. అనంతరం రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ చేసి జట్టుకు మరో విజయం ఖాయం చేశారు. రాహుల్ ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదగా, కోహ్లీ ఒక బౌండరీ బాదాడు.

కోహ్లీ లేకున్నా..
చివరగా టీమిండియా ఐదో టీ20లోనూ మొదట బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రాహుల్ (45), రోహిత్ (60), శ్రేయస్ అయ్యర్ (33) రాణించారు. అనంతరం సీఫర్ట్ (50), రాస్‌టేలర్ (53) అర్ధశతకాలతో రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ తేలిపోవడంతో చివరికి న్యూజిలాండ్ 156/9 స్కోరుకు పరిమితమైంది. దీంతో టీమ్‌ఇండియా ఏడు పరుగులతో విజయం సాధించి 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఈ సారి అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేస్తే..
ఈ సిరీస్‌లో ప్రతీ బ్యాట్స్‌మెన్ తమ వంతు పాత్ర పోషించారు. ఒకరు కాకపోతే మరొకరన్నట్లు బాధ్యత తీసుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లోనూ సమష్టిగా రాణించారు. ఒత్తిడి ఎదురైన వేళ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మ షమీ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అలాంటి పట్టుదలే ప్రదర్శిస్తే కివీస్‌తో పోరులో విజయం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంటే టీమ్ బ్యాలెన్స్‌గా ఉంటుందని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications