Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: భారత్ X న్యూజిలాండ్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

IND vs NZ T20 WC 2021 Free Live Streaming: How To Watch India vs New Zealand For Free

హైదరాబాద్: అనూహ్యంగా టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. పాకిస్థాన్ చేతితో ఎదురైన పరాజయాన్ని మరిచి టోర్నీ ముందుకు సాగాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతోంది. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం అదే పాకిస్థాన్ చేతిలో ఓడి.. భారత పరిస్థితినే ఎదుర్కొంటుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో చూడవచ్చనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. అయితే మ్యాచ్‌లు చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్ స్టార్ ‌ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించుకోవాల్సిందే. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌ను మాత్రం ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా చూడవచ్చు. ఈ మ్యాచే కాదు.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే అన్నీ మ్యాచ్‌లను పుక్కట్ల వీక్షించవచ్చు. అవును.. డీడీ స్పోర్ట్స్ చానెల్‌లో భారత్‌కు సంబంధించిన అన్నీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. డబ్బులు చెల్లించలేని వారు ఎవరైనా ఉంటే డీడీ స్పోర్ట్స్ చానెల్ సేవలను వాడుకోవచ్చు.

పాకిస్థాన్ చేతిలో ఎదురైన అనూహ్య పరాజయం టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షే అవుతుంది.

మెగాటోర్నీలో భారత్ విజయాల బాట పట్టాలంటే ముందుగా టీమ్ కాంబినేషన్‌ను మార్చాలి. ఫస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన భువనేశ్వకుమార్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా జట్టుకు భారమైన హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాలి. భువనేశ్వర్ స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్డూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించాలి. స్లో బౌలర్ అయినటువంటి శార్దూల్.. కీలక సమయంలో వికెట్లు తీయడంలో దిట్ట. లోయరార్డ్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌లా భారీ షాట్లు ఆడగలడు. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే పాక్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఉంటే భారత్ కనీసం పోటీ అయిన ఇచ్చేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అతను సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో అతని పాత్ర చాలా కీలకం. కాబట్టి అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలి.

Story first published: Friday, October 29, 2021, 22:55 [IST]
Other articles published on Oct 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+