న్యూజిలాండ్‌తో ఐదు టీ20లో సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీలకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చామని పేర్కొన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బాగుంది. మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం ఉండవచ్చు. మా ఆటగాళ్లకు చెప్పేది ఒక్కటే నిర్బయంగా ఆడండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ఆటను ఆస్వాదించండి. అదే సమయంలో వినమ్రంగా ఉండండి. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో రెండు మార్పులు చేశాం. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీలకు విశ్రాంతి ఇచ్చి, వారి స్థానాల్లో బుమ్రా, బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'మేం గత మ్యాచ్‌లో బాగానే బ్యాటింగ్ చేశాం. గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని, ఈ మ్యాచ్‌లో వాటిని అమలు చేయాలనుకుంటున్నాం. త్వరగా గత మ్యాచ్ ఫలితాన్ని మరిచి ముందుకు వెళ్లాలి. నిషమ్ ఆడాల్సింది కానీ అతను గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అందుకే ఫోక్స్ స్థానంలో జేమీసన్ జట్టులోకి వచ్చాడు.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
భారత్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.