న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్‌ను నైట్‌వాచ్‌మన్‌గా పంపించడాన్ని కివీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. ఈ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసిందన్నాడు. ముంబై వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ నైట్‌వాచ్‌మన్‌గా బరిలోకి దిగి గోల్డెన్ డకౌటయ్యాడు.
ఆజాజ్ పటేల్ వేసిన షార్ప్ టర్న్ బాల్‌ను ఆడలేక వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో అనవసర ఒత్తిడి నెలకొంది. క్రీజులోకి వచ్చిన కోహ్లీ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. 8 బంతులు.. 6 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది.

సిరాజ్ గోల్డెన్ డకౌట్ అవ్వడంపై సైమన్ డౌల్ ఘాటుగా స్పందించాడు. సిరాజ్‌కు బదులు రవిచంద్రన్ అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపించాల్సిందని, అతను స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడేవాడని చెప్పుకొచ్చాడు.
'టెయిలెండర్, లోయరార్డర్ బ్యాటర్లను నైట్‌వాచ్‌మన్ అని పిలవడం నాకు నచ్చదు. రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు పంపించలేదు? వికెట్లను కాపాడుకోవడం కోసం బౌలర్‌ను బ్యాటింగ్ పంపించే బదులు.. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వారిని పంపిస్తే ఏమవుతుంది. అశ్విన్ బ్యాటింగ్ చేయగలడు. అతను ఔటవ్వకుండా క్రీజులో నిలిచినా.. ఉదయం వచ్చి పరుగులు చేయగలడు.
వాస్తవానికి ఆజాజ్ పటేల్, న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయలేదు. యశస్వి జైస్వాల్ కూడా చెత్త షాట్‌తోనే పెవిలియన్ చేరాడు. అలాంటి పరిస్థితుల్లో అనవసరంగా స్పిన్ వికెట్‌పై ఆడే నైపుణ్యం లేని టెయిలెండర్‌ను పంపించి వారికి లేని ఉత్సాహాన్ని అందించారు. సిరాజ్‌ను పంపించడం టీమిండియా చేసిన అతిపెద్ద పొరపాటు.
విరాట్ కోహ్లీ కోసం నైట్ వాచ్‌మన్ పంపించారనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. కానీ చాలా మంది బ్యాటర్లకు నైట్‌వాచ్‌మన్‌గా ఉండేందుకు ఇష్టపడుతారు. ఉదయం వచ్చి పరుగులు చేయాలనుకుంటారు. కాబట్టి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లనే నైట్‌వాచ్‌మన్‌గా పంపించండి'అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.