IND vs NZ: శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్ ముందు టఫ్ టార్గెట్!

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 126 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. వన్డే ఫార్మాట్‌ను ఫామ్‌ను కొనసాగిస్తూ.. టీ20ల్లోనూ సత్తా చాటగలనని విధ్వంసకర సెంచరీతో చాటి చెప్పాడు. దాంతో న్యూజిలాండ్ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. గిల్‌కు అండగా రాహుల్ త్రిపాఠి(44), హార్దిక్ పాండ్యా(30) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్‌వేల్, టిక్‌నర్, సోదీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తీసారు.

ఇషాన్ కిషన్ విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మైకేల్ బ్రేస్‌వేల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు.
టిక్‌నర్ వేసిన ఐదో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ మూడు బౌండరీలు బాదగా.. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్‌లో త్రిపాఠి వరుసగా బౌండరీ, సిక్స్ బాదాడు. ఈ ఓవర్ చివరి బంతికి శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిక్‌నర్ నేలపాలు చేశాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది.

త్రిపాఠి మెరుపులు..
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గిల్.. కివిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు త్రిపాఠి కూడా సిక్స్‌లు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. హాఫ్ సెంచరీ చేరువైన త్రిపాఠి(44).. ఇష్ సోదీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయే క్యాచ్ ఔటయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో క్రీజులోకి వచ్చిన డేంజరస్ సూర్య కూడా బౌండరీతోనే తన ఖాతా తెరిచాడు. ఇష్ సోదీ బౌలింగ్‌లో సూర్య భారీ సిక్సర్ బాదగా.. సాంట్నర్ వేసిన మరుసటి ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో శుభ్‌మన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

శుభ్‌మన్ సెంచరీ..
సిక్సర్ బాది జోరు కనబర్చిన సూర్య(24).. బ్రేస్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 38 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. శుభ్‌మన్ విశ్వరూపం చూపించాడు. సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. బెన్ లిస్టర్ వేసిన 16వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన శుభ్‌మన్.. టిక్‌నర్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు బాదాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్‌లో బౌండరీ బాది 54 బంతుల్లో కెరీర్‌లో తొలి టీ20 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లోనే గిల్.. రెండో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మరుసటి బంతిని సిక్స్ బాదిన గిల్ జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

103 పరుగుల భాగస్వామ్యంతో..
ఆ మరుసటి బంతికి గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కివీస్ ఫీల్డర్లు మరోసారి వదిలేసారు. హార్దిక్ సైతం బౌండరీలు బాదడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. 19వ ఓవర్‌లో గిల్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ దగ్గర బ్రేస్‌వేల్ అసాధారణ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను ఆపాడు. కానీ గిల్ వరుసగా 4, 6 బాది 17 పరుగులు పిండుకున్నాడు. డారిల్ మిచెల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి హార్దిక్(30) ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 6 పరుగులే రావడంతో టీమిండియా 234 పరుగులకు పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications