దానికి బలం ఎందుకన్నా.. టైమింగ్ అయితే చాలు: శుభ్‌మన్ గిల్

వెల్లింగ్టన్: సిక్స్‌లు కొట్టడానికి బలం అవసరం లేదని, టైమింగ్ అయితే చాలని టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన శుభ్‌మన్ గిల్.. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌కు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు. న్యూజిలాండ్‌లో తనకు చాలా తీపి జ్ఞాపకాలున్నాయని, అండర్ 19 ప్రపంచకప్ ఇక్కడే గెలిచామని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసింది కూడా ఇక్కడేనని చెప్పాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఇక్కడే అరంగేట్ర చేయబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ సీక్రెట్ వెల్లడించాడు.

బలం ఎందుకన్నా..
వీలైనంత వరకు డాట్ బాల్స్ తక్కువగా ఆడుతూ.., స్ట్రైక్ రొటేట్ చేయడమే తన సక్సెస్‌కు కారణమన్నాడు. 'సిక్స్‌లు కొట్టడానికి బలం అవసరం లేదని, టైమింగ్ అయితే చాలనేది నా గట్టి నమ్మకం. నేను క్రీజులో సెట్ అయితే సిక్స్‌లు కొట్టగలను. అయితే సిక్స్‌లు, ఫోర్లు కొట్టడం కంటే పరుగులు చేయడంపైనే ఫోకస్ పెడతాను. వీలైనంత మేరకు తక్కువ డాట్ బాల్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాను. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తా. బంతిని బలంగా కొట్టడం కంటే వేచి చూసి ఆడటమే ముఖ్యమని భావిస్తా.

మధుర జ్ఞాపకాలు..
న్యూజిలాండ్‌తో నాకు వీడదీయని బంధం ఉంది. అండర్ 19 ప్రపంచకప్ ఆడేందుకు నేను తొలిసారి ఇక్కడికి వచ్చాను. నా వన్డే అరంగేట్రం కూడా ఇక్కడే 2019లో జరిగింది. మళ్లీ న్యూజిలాండ్ రావడం సంతోషంగా ఉంది. న్యూజిలాండ్‌లో నాకు మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఎప్పుడైనా న్యూజిలాండ్ వెళ్తున్నానని తెలిసిన వెంటనే నా ముఖంలో చిరునవ్వు వస్తుంది. ప్రాక్టీస్ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడంతోనే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సక్సెస్ అయ్యాను'అని శుభ్‌మన్ గిల్ వివరించాడు.

రోహిత్ లేకపోవడంతో..
టెస్ట్‌ల్లో రెగ్యూలర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్.. వన్డేల్లోనూ ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉండటంతో టీ20 ఫార్మాట్‌లోనూ తొలి అవకాశాన్ని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో నేడు జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వడంతో శుభ్‌మన్ టీ20 అరంగేట్రం ఆలస్యమైంది. ప్రపంచకప్ 2022లో ఓపెనర్లు దారుణంగా విఫలమవ్వడంతో శుభ్‌మన్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. నిలకడగా రాణిస్తే 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ గిల్ ఓపెనర్‌గా ఆడుతాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications