Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 వన్డేల్లో 2 సెంచరీలు.. ఒక డబుల్ సెంచరీ.. రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్!

IND vs NZ: Shubman Gill Equals Babar Azams World Record after smashing 4th ton

ఇండోర్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ ‌గిల్ తన జోరును కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్(శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 112) సెంచరీలతో చెలరేగాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్ గిల్.. గత నాలుగు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీతో పాటు రెండు శతకాలు బాదాడు.

ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 208(149), 40 నాటౌట్(53), 112(78)‌లతో 360 పరుగులు చేశాడు. దాంతో ఓ వన్డే సిరీస్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ రికార్డును సమం చేశాడు. బాబర్ ఆజామ్ 2016లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్ కూడా అన్నే రన్స్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత ఇమ్రుల్ కమేస్(349), డికాక్(342), మార్టిన్ గప్టిల్(330) ఉన్నారు.

అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వన్డే శతకాలు నమోదు చేసిన నాలుగో బ్యాటర్‌గా శుభ్‌మన్ గుర్తింపు పొందాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు బాదిన శుభ్‌మన్.. ఇమామ్ ఉల్‌ హక్(9), క్వింటన్ డికాక్(16), డెన్నిస్ అమిస్(18) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో షిమ్రాన్ హెట్‌‌మైర్(22)‌ను గిల్ వెనక్కినెట్టాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా 4 శతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ రికార్డును అధిగమించాడు. ధావన్ 24 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఈ ఏడాది ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 70(60), 21(12), 116(97), 208(149), 40*(53), 112(78) వరుసగా రాణించాడు. 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో పాటు డబుల్ సెంచరీ సాధించి 567 పరుగులు చేశాడు. అసాధారణ ఫామ్ కనబరుస్తున్న శుభ్‌మన్ గిల్ ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు.

Story first published: Tuesday, January 24, 2023, 18:24 [IST]
Other articles published on Jan 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+