For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ భాయ్ ఫామ్‌లోనే ఉన్నాడు: శుభ్‌మన్ గిల్

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా.. మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పాడు. ప్రతీసారి భారీ స్కోర్లు చేయడం సాధ్యం కాదని వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగులతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత గడ్డపై తొలిసారి న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ గెలిచింది.

ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 61 పరుగులే చేశాడు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ ఘోర పరాజయం అనంతరం మీడియాతో మాట్లాడిన గిల్.. రోహిత్ శర్మతో పాటు భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు అండగా నిలిచాడు. అప్పుడప్పుడు ఇలా విఫలమవ్వడం సాధారణమేనని తెలిపాడు.

రోహిత్ ఫామ్‌లోనే ఉన్నాడు..

'రోహిత్ భాయ్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రతీ ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మార్చడం సాధ్యం కాదు. తొలి రెండు వన్డేల్లో అతనికి మంచి ఆరంభాలు లభించాయి. ఒక బ్యాటర్‌గా ఆ ఆరంభాలను సెంచరీలుగా మార్చాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ప్రతీసారి అది సాధ్యపడదు.

IND vs NZ Shubman Gill Defends Rohit Kuldeep and Jadeja After India s 3-0 ODI Series Defeat

ఈ సిరీస్‌లో జడేజా విఫలమైనా.. మంచి టచ్‌లో‌నే ఉన్నాడు. గత రెండేళ్లుగా అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో నాకు తెలియదు. కానీ బ్యాటింగ్ పరంగా అతను మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతని విషయం పక్కనపెడితే బ్యాటర్లమైన మేమంతా మాకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోయాం. సాధారణంగా భారత్‌లో ఆడేటప్పుడు హై స్కోరింగ్ మ్యాచ్‌లు చూస్తుంటాం. ఒకవేళ బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించి, వాటిని కనీసం ఇద్దరు బ్యాటర్లయినా పెద్ద స్కోర్లుగా మార్చకపోతే.. విజయం సాధించడం కష్టమవుతుంది.

అది దురదృష్టకరం..

అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి. కుల్దీప్ యాదవ్ గత కొన్నేళ్లుగా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఎప్పుడూ మాకు వికెట్లు తీసిపెట్టే ప్రధాన బౌలర్. ఈ సిరీస్‌లో అతను ఆశించిన రీతిలో వికెట్లు తీయకపోవడం దురదృష్టకరం. కానీ ఇలాంటి వైఫల్యాలే గుణపాఠం నేర్పుతాయి.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు మూడు మ్యాచ్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీసారు. కుల్దీప్ యాదవ్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒకే ఒక్క వికెట్ తీసాడు. అది కూడా రెండో వన్డేలో. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ వికెట్లు ఏమి తీయలేదు. భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్ షాట్లతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ భారత స్పిన్నర్లను చెడుగుడు ఆడాడు. ఈ ఇద్దరి వైఫల్యం భారత విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Monday, January 19, 2026, 10:01 [IST]
Other articles published on Jan 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+