IND vs NZ: సెంచరీతో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డుకే ఎసరు!

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీతో చెలరేగాడు. శ్రీలంకతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీతో కలిసి శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలోనూ అదే జోరును కొనసాగించాడు. టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ తడబడిన వికెట్‌పై అసాధారణ బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు.
మిచెల్ సాంట్నర్ వేసిన 30వ ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచి 99 పరుగులకు చేరుకున్న గిల్.. మరుసటి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా మూడో వన్డే శతకం. ఈ సెంచరీతో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
తొలి భారత ప్లేయర్‌గా..
భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. 19 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ 1000 పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ల రికార్డులను శుభ్‌మన్ అధిగమించాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లు 24 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలు రాయి అందుకున్నారు.
ఓవరాల్‌గా రెండో ప్లేయర్..
ఓవరాల్‌గా ఈ జాబితాలో పాకిస్థాన్ బ్యాటర్ ఫకార్ జమాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 18 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్, శుభ్‌మన్ గిల్(19) రెండో స్థానంలో ఉండగా.. వివ్ రిచర్డ్స్(21), కెవిన్ పీటర్సన్(21), జోనాథన్ ట్రోట్(21) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(34),శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ ఔటయ్యాడు.

శుభ్‌మన్ మినహా టాప్-5 విఫలం..
ఆ తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(8) మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ ఔటవ్వగా.. సూర్యకుమార్ యాదవ్(31) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కానీ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్‌మన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ విచిత్ర పరిస్థితుల్లో పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియా 249 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications