Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అయ్యర్ సెంచరీ.. భారత్ 345 ఆలౌట్!

IND vs NZ: Shreyas Iyers debut century highlights Indias 345

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 111.1 ఓవర్ల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 258/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను మొదలెట్టిన టీమిండియా కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ దెబ్బతీశాడు. అర్ధ సెంచరీ సాధించిన జడేజా.. ఆ తర్వాత సాహా, సెంచరీ హీరో శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలను పెవిలియన్‌కు పంపి లాంఛనం పూర్తి చేశాడు.

ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ హీరో జడేజా(112 బంతుల్లో 4 ఫోర్లతో 50) ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. టీమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సాహా(1) తీవ్రంగా నిరాశపరిచాడు. సౌథీ బౌలింగ్‌లోనే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో అయ్యర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్ తొలికి బంతికి క్విక్ డబుల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మన్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. శతకం కోసం 156 బంతులు ఆడిన అతను.. 13 ఫోర్లు 2 సిక్సులు బాదాడు. ఇక సొంతగడ్డపై సెంచరీ బాదిన 10వ ఆటగాడిగా అయ్యర్ గుర్తింపు పొందాడు.

ఇక కాన్పూర్ వేదికగా అరంగేట్రం చేసి సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా కూడా అయ్యర్ ఘనతను అందుకున్నాడు. అంతకు ముందు గుండప్ప విశ్వనాథన్ కాన్పూర్‌లో అరంగేట్రం చేసి శతకం బాదాడు. న్యూజిలాండ్ జట్టుపై డెబ్యూ సెంచరీ చేసిన మూడవ బ్యాటర్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. కాగా, టీమ్ ఇండియా తరపున డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన చివరి ముగ్గురు బ్యాటర్లు కూడా ముంబైకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. రోహిత్ శర్మ, పృథ్వీషా తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ జాబితాలో చేరాడు.

ఆ కొద్ది సేపటికే సౌథీ వేసిన 96.1 ఓవర్‎లో విల్‎కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ 105 పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 3, ఉమేశ్ యాదవ్(10), ఇషాంత్ శర్మ(0)తీవ్రంగా నిరాశపరిచాడు. అశ్విన్(38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‎లో 111.1 ఓవర్లలో 345 పరుగుల వద్ద ముగిసింది.

Story first published: Friday, November 26, 2021, 15:21 [IST]
Other articles published on Nov 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+