Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sarfaraz Khan: ఇదెక్కడి షాట్ రా అయ్యా.. పిచ్‌పై డ్యాన్స్ చేస్తున్నావ్!(వీడియో)

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ స్టన్నింగ్ షాట్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ కళ్లు చెదిరే ర్యాంప్ షాట్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు.

విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వికెట్‌పై బ్రేక్ డ్యాన్స్ చేస్తూ బంతిని బౌండరీకి తరలించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడిన సర్ఫరాజ్ ఖాన్.. 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే విలియమ్ ఓ రూర్కే వేసిన 27వ ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆడిన ఓ షాట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'ఇదెక్కడి షాట్ రా అయ్యా'అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

IND vs NZ Sarfaraz Khan s incredible ramp-shot off William O Rourke goes viral

ఈ ఓవర్ చివరి బంతిని విలియమ్ లో-బౌన్సర్‌గా వేయగా.. సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి వంగా అప్పర్ కట్ షాట్ ఆడాడు. దాదాపు నేలకు తాకేలా కిందికి వంగి ఆడిన ఈ షాట్.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. బంతి కీపర్ తలపై నుంచి బౌండరీ దూసుకెళ్లింది. ఈ షాట్ చూసి అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిచ్ బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

ఇదే ఓవర్ నాలుగో బంతిని సర్ఫరాజ్ ఖాన్ అప్పర్ కట్‌తోనే సిక్సర్ బాదాడు. 7 ఫోర్లు, 3 సిక్సర్లతో సర్ఫరాజ్ ఖాన్ వేగంగా పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ.. మూడో రోజు ఆటలోని చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Story first published: Friday, October 18, 2024, 18:51 [IST]
Other articles published on Oct 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+