టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రిషభ్ పంత్‌తో కలిసి 178 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అయితే రిషభ్ పంత్ రనౌటయ్యే ప్రమాదం నుంచి సర్ఫరాజ్ ఖాన్ కాపాడాడు. అనవసర డబుల్‌కు ప్రయత్నించిన రిషభ్ పంత్‌ను వద్దంటూ గట్టిగా అరిచి అడ్డుకున్నాడు.
దాంతో పంత్ యూటర్న్ చేసుకొని క్రీజులోకి చేరుకున్నాడు. పంత్‌కు రెండో రన్ వద్దంటూ సర్ఫరాజ్ ఖాన్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాట్ హెన్రీ వేసిన 56వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని సర్ఫరాజ్ ఖాన్ లేట్ కట్ షాట్‌తో డీప్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ పూర్తి చేశాడు.

అయితే బంతివైపే చూసిన పంత్.. రెండో పరుగుకు ప్రయత్నించాడు. ఫీల్డర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన సర్ఫరాజ్ ఖాన్.. రన్ వద్దంటూ గట్టిగా అరిచాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ వైపు ఉన్న అతను జంప్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ అరుపులతో అప్రమత్తమైన పంత్.. యూటర్న్ తీసుకోని క్రీజులోకి వెళ్లాడు. లేకుంటే పంత్ రనౌటయ్యేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్(195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150), రిషభ్ పంత్(105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99) రాణించినా... లోయరార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.
రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేయగా.. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు భారీ లక్ష్యం నమోదు చేస్తుందనిపించింది. కానీ సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగు బంతులే ఆడి ఒక్క పరుగు చేయలేదు.
బ్యాడ్ లైట్‌తో పాటు వర్షం కారణంగా నాలుగో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.