న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో కీలక సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో రోహిత్ శర్మతో పాటు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు.
అప్పటి వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. అంపైర్ ఔటివ్వగా.. కోహ్లీ రివ్యూ కోరాడు. కానీ రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. కోహ్లీ ఔటవ్వడంతో రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.

అతని రియాక్షన్ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కోహ్లీ ఔటవ్వడంతో మూడో వికెట్‌కు నమోదైన 136 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ శర్మ సైతం ఇదే తరహాలో ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లిన బంతి వికెట్లను తాకేసింది.
రోహిత్, కోహ్లీ ఔటైన విధానంపై టీమిండియా ఫ్యాన్స్ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతంగా ఆడారు. ఇక 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది.
The reactions of Captain Rohit Sharma when Virat Kohli got out on last ball. 💔 pic.twitter.com/P43YwQTZOb
— Tanuj Singh (@ImTanujSingh) October 18, 2024
Captain Rohit Sharma reaction on Virat Kohli's wicket😢
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 18, 2024
Rohit's reaction is saying it all 🥲 pic.twitter.com/eXuGYLlEwD
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 18, 2024