IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్‌గా అజింక్యా రహానే!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2021లో దారుణ వైఫల్యం అనంతరం స్వదేశం చేరిన టీమిండియా.. మరో వారం వ్యవధిలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్‌తోనే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. అయితే టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే రోహిత్ శర్మకు టీ20 సారథ్యబాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానన్న విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ, జడేజాలకు విశ్రాంతినిచ్చింది.

ఫస్ట్ టెస్ట్‌కు కోహ్లీ దూరం..
సీనియర్ల గైర్హాజరీలో ముగ్గురు కొత్త ప్లేయర్లను టీమ్‌లో అవకాశం కల్పించింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్)తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలచిన హర్షల్ పటేల్(ఆర్‌సీబీ), అవేశ్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్)ను ఎంపిక చేసింది. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి రాగా.. టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన భువనేశ్వర్ కుమార్‌కు మరో అవకాశం ఇచ్చింది. ఇక ఈ సిరీస్ నుంచే రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక లాంగ్ లీవ్ తీసుకున్న విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. దాంతో ఫస్ట్ టెస్ట్‌కు కూడా రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని, అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడని ప్రచారం జరిగింది.

కెప్టెన్ రోహిత్? రహానే?
గత కొంతకాలంగా నిలకడలేమని ఆటతో విఫలమవుతున్న అజింక్యా రహానేను కాదని రోహిత్ వైపే సెలెక్టర్ల మొగ్గు చూపారని వార్తలు వచ్చాయి.
కానీ ఇవన్నీ గాలి వార్తలేనని స్పష్టమైంది. అసలు టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. టీ20 సిరీస్‌లో జట్టును నడిపించనున్న రోహిత్.. టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోనున్నాడట. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వనున్నామని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

టీమ్ ప్రకటనతోనే క్లారిటీ..
దాంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు మార్గం సుగుమమైంది. గతేడాది ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రావడంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రహానే జట్టును విజయపథంలో నడిపించాడు. ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలడంలో కెప్టెన్‌గా రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే రోహిత్ శర్మ విశ్రాంతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. వచ్చే శుక్రవారం టెస్టు జట్టును ప్రకటించనున్నారు. అప్పుడే టీమ్‌పై క్లారిటీ రానుంది. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications