For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: తప్పంతా నాదే.. అది నా నిర్ణయమే: రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణ వైఫల్యానికి కారణం తానేనని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో తాను తప్పిదం చేశానని అంగీకరించాడు. పిచ్‌ను సరిగ్గా రీడ్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడం.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం వంటి నిర్ణయాలు తాను తీసుకున్నేవనని స్పష్టం చేశాడు.

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పేలవ బ్యాటింగ్‌తో 46 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీమిండియా మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలే బ్యాటింగ్ వైఫల్యానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది.

IND vs NZ Rohit Sharma says I didn t read the pitch in Bengaluru Test well enough

రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత తనేదనని తెలిపాడు. పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే.. ముందుగా బ్యాటింగ్ చేయడంతో పాటు ఎక్స్‌ట్రా స్పిన్నర్‌‌ వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.

'పిచ్‌పై గడ్డి లేకపోవడంతో పేస్‌కు అనుకూలంగా ఉండదనుకున్నా. తొలి సెషన్‌లో కాస్త పేస్‌కు అనుకూలంగా ఉండి ఆ తర్వాత ఫ్లాట్‌గా మారుతుందని భావించా. ఆ తర్వాత స్పిన్నర్లకు టర్న్ లభిస్తుందని అంచనా వేసాను. భారత్‌లో ఎప్పుడు ఆడినా తొలి సెషన్ చాలా కీలకం. ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.

కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడానికి గల ప్రధాన కారణం అతను ఫ్లాట్ వికెట్స్‌పై అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలడు. ఈ పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని అంచనా వేసాను. పిచ్‌ను అంచనా వేయడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. దాంతో ఈ కఠిన పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చింది.

కెప్టెన్‌గా ఈ 46 పరుగులు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేయడం నా నిర్ణయం. అయితే ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం. ఈ రోజు మాకు ఏదీ కలిసి రాలేదు. ఏడాదిలో ఇలా ఒకటి రెండు సార్లు తప్పులు చేయడం సాధారణమే'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 17, 2024, 21:25 [IST]
Other articles published on Oct 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+