Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డ్‌పై కన్నేసిన హిట్ మ్యాన్!

సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సన్నదమైంది. న్యూజిలాండ్‌తో బుధవారం(అక్టోబర్) నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో ఇంకా మ్యాచ్ ప్రారంభం కాలేదు.

మరోవైపు ఈ సిరీస్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతో పాటు సొంతగడ్డపై తమ జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. సొంతగడ్డపై భారత్ ఇప్పటి వరకు వరుసగా 17 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. 18వ సిరీస్‌ విజయంపై కన్నేసింది.

IND vs NZ Rohit Sharma Needs 258 Runs And 13 Sixes In New Zealand Series To CREATE History

తొలి భారత బ్యాటర్‌గా..
ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్.. 258 పరుగులు చేస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా హిట్ మ్యాన్ నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 742 పరుగులతో ఉన్నాడు.

డబ్ల్యూటీసీలో రెండు సార్లు 1000కిపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా రికార్డ్ అందుకుంటాడు. డబ్ల్యూటీసీ 2019-2021 ఎడిషన్‌లో రోహిత్ శర్మ 1094 పరుగులు చేశాడు.

IND vs NZ Rohit Sharma Needs 258 Runs And 13 Sixes In New Zealand Series To CREATE History

సెహ్వాగ్ రికార్డ్‌కు చేరువలో...
ప్రస్తుతం టెస్ట్‌ల్లో 87 సిక్స్‌లతో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మరో 13 సిక్స్‌లు బాదితే.. 100 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ టెస్ట్‌ల్లో 100 ప్లస్ సిక్స్‌లు బాదారు.

మరో ఐదు సిక్స్‌లు బాదితే భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. తద్వారా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను బద్దలు కొడుతాడు. సెహ్వాగ్ 91 సిక్స్‌లతో టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీ రికార్డ్‌...
డబ్ల్యూటీసీ చరిత్రలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా 12 విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా డబ్ల్యూటీసీలో 14 విజయాలు అందించాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేస్తే.. రోహిత్ శర్మ.. కోహ్లీ రికార్డ్‌ను అధిగమిస్తాడు.

Story first published: Wednesday, October 16, 2024, 13:55 [IST]
Other articles published on Oct 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+