న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా కష్టాలు కొనసాగుతున్నాయి. పేలవ బ్యాటింగ్‌తో 46 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. ఫీల్డింగ్‌లోనూ అదే తడబాటు కనబరుస్తోంది. భారత బ్యాటర్లు తడబడ్డ వికెట్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.
ఇక న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని సిరాజ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా వేయగా.. లాథమ్ కవర్ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్ ఫీల్డర్ కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది.

అలర్ట్‌గా లేని కేఎల్ రాహుల్ కనీసం క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. తన క్యాచ్ కాదంటూ రియాక్షన్ ఇచ్చాడు. కానీ రిప్లేలో రాహుల్ పట్టాల్సిన క్యాచ్ అనే విషయం స్పష్టమైంది. సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ అసహనం వ్యక్తం చేశాడు.
ఈ క్యాచ్ పట్టి ఉంటే టామ్ లాథమ్ 7 పరుగులకే వెనుదిరిగేవాడు. ఆ కాసేపటికే లాథమ్(17)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో కేఎల్ రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. బ్యాటింగ్ వైఫల్యం నుంచి రాహుల్ తేరుకోనట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది.
రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డేవాన్ కాన్వే(67 బ్యాటింగ్), విల్ యంగ్(24 బ్యాటింగ్) సూపర్ బ్యాటింగ్‌తో 31 ఓవర్లు ముగిసే సరికి 111 పరుగులు చేసింది.
— Captain 45 (@45_captain_) October 17, 2024