Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్ (వీడియో)

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో 109 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి సెంచరీ. కీలక సమయంలో సూపర్ బ్యాటింగ్‌తో వీరోచిత శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. తనకు ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు.

టీమ్ సౌథీ వేసిన 57వ ఓవర్‌ మూడో బంతిని సర్ఫరాజ్ ఖాన్ బౌండరీ తరలించి సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ పూర్తయిన వెంటనే సర్ఫరాజ్ ఖాన్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లంతా సర్ఫరాజ్ ఖన్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ అయితే ముసిముసి నవ్వుకున్నాడు.

IND vs NZ Rohit Reaction after Sarfaraz Khan hits maiden Test hundred in 1st Test vs New Zealand

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నవ్విన సందర్భం ఇదే కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా ఆటతీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ.. సర్ఫరాజ్ ఖాన్ శతకంతో నవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సర్ఫరాజ్ ఖాన్ శతకంతో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. 62 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లకు 291 పరుగులు చేసింది. సర్పరాజ్ ఖాన్‌తో పాటు రిషభ్ పంత్(22) క్రీజులో ఉన్నాడు. టీమిండియా ఇంకా 65 పరుగుల వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Saturday, October 19, 2024, 10:37 [IST]
Other articles published on Oct 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+