Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కేన్ మామ ఔట్.. ఎగిరి గంతేసిన బాబీ!(వీడియో)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు దుమ్మురేపుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా షాకిచ్చారు. దాంతో కివీస్ 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్డే, అతని కూతురు సమైరా‌తో పాటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియాకు మద్దతుగా స్టాండ్స్‌లో సందడి చేస్తున్నారు.

IND vs NZ Ritika Sajdeh s reaction goes viral after Kuldeep dismissed Kane Williamson

రచిన్ రవీంద్ర క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ చేజార్చినప్పుడు.. అయ్యో అంటూ అనుష్క శర్మ, రితికా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. కేన్ విలియమ్సన్‌ను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్‌గా బోల్తా కొట్టించగా.. రితికా సజ్దే ఎగిరి గంతేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాబీలు మంచి జోష్‌లో ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. పేసర్లను అలవోకగా ఆడుతుండటంతో రోహిత్ శర్మ.. పవర్ ప్లేలోనే వరుణ్ చక్రవర్తీని బరిలోకి దించాడు. రచిన్ రవీంద్ర ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. రిటర్న్ క్యాచ్‌ను మహమ్మద్ షమీ నేలపాలు చేయగా.. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఓ క్యాచ్ వదిలేసాడు. అదే ఓవర్‌లో విల్ యంగ్‌ను వరుణ్ ఔట్ చేయగా.. పవర్ ప్లేలో న్యూజిలాండ్‌ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించగా.. అతను వరుస ఓవర్లలో రచిన్ రవీంద్ర(37), కేన్ విలియమ్సన్(11)ను పెవిలియన్ చేర్చాడు. టామ్ లాథమ్(14)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

Story first published: Sunday, March 9, 2025, 16:50 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+