IND vs NZ: మళ్లీ విఫలమైన రిషభ్ పంత్.. మండిపడుతున్న ఫ్యాన్స్.. ఇకనైనా సంజూకు చాన్స్..

క్రైస్ట్‌చర్చ్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలోనూ పంత్(10) దారుణంగా విఫలమయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో వరుసగా అవకాశాలు అందుకున్న పంత్ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదని, అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పంత్‌కు బదులు సంజూ శాంసన్‌ను ఆడించినా జట్టుకు మేలు జరిగేదని కామెంట్ చేస్తున్నారు.
సంజూను ఆడించినా..
రిషభ్ పంత్‌కు వచ్చిన అవకాశాలు జట్టులో ఎవరికి రాలేదని, అతను మాత్రం వరుసగా విఫలమవుతూనే ఉన్నాడని మండిపడుతున్నారు. ఈ అవకాశాలే సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే జట్టు పాతుకుపోయే వాడని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి మరీ పంత్‌కు ఛాన్స్‌లు ఇస్తుండటం పట్ల సంజూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్ కోసం బీసీసీఐ శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
హర్షా భోగ్లే ప్రశ్నతో..
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు రిషభ్ పంత్ సీరియస్ అయ్యాడు. అహంకారపూరితంగా సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా అభిమానులు పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'వీరేంద్ర సెహ్వాగ్‌ను చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రశ్న అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. నిన్ను చూస్తుంటే.. వైట్ బాల్ క్రికెటర్‌గా కంటే నీ టెస్ట్ రికార్డ్స్ మెరుగ్గా ఉన్నాయనిపిస్తోంది?'అని పంత్‌ను భోగ్లే అడిగాడు.
దీనికి రిషబ్ బదులిస్తూ.. 'సార్, రికార్డులనేవి కేవలం అంకెలు మాత్రమే. నా వైట్ బాల్ రికార్డ్ దారుణంగా కూడా లేదు కదా'' అన్నాడు.
బలుపు మాటలతో..
పంత్ మాటలకు అడ్డుతగిలిన హర్షా భోగ్లే.. దారుణంగా ఉందని అనడం లేదు.. టెస్ట్ నంబర్లతో పోలుస్తున్నానంతే' అంటూ వివరణ ఇచ్చాడు.'పోలిక తేవడం అనేది నా జీవితంలో భాగం కాదు. ఇప్పుడు నా వయసు 24-25 ఏళ్లు. నాకు 30-32 ఏళ్లు వచ్చినప్పుడు నా పరిమిత ఓవర్ల క్రికెట్ గణాంకాలను, టెస్టు రికార్డులతో పోల్చి చూడండి'అంటూ పంత్ ఒకింత అసహనంగా బదులిచ్చాడు. అయితే పంత్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాట్‌తో పరుగులు చేయ చేతకాదు కానీ.. బలుపు మాటలకు తక్కువ లేదని మండిపడుతున్నారు.
మ్యాచ్ రద్దు..
భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్(64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టు పరువును కాపాడగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సూర్య, అయ్యర్, దీపక్ హుడాలు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. అయితే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో కివీస్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications