Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఆహా జడేజా.. వాటే బాల్.. బిత్తరపోయిన బ్లండెల్!(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ బాల్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో జడేజా కళ్లు చెదిరే బంతితో టామ్ బ్లండెల్‌(41)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన అతన్ని స్టన్నింగ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు.

జడేజా వేసిన ఈ బంతికి టామ్ బ్లండెల్ నోరెళ్లబెట్టాడు. అలా ఎలా బంతి మిస్సైందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జడేజా వేసిన 60వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ మూడో బంతిని రౌండ్‌ ద వికెట్ వేయగా.. బ్లండెల్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మిస్సైన బంతి.. బ్యాట్, ప్యాడ్ గ్యాప్‌లో నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్‌ను లేపేసింది.

IND vs NZ Ravindra Jadeja Cleans Up Tom Blundell Video Goes Viral

ఈ మ్యాచ్‌లో జడేజాకు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 198/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులు చేసింది. టామ్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ బ్లండెల్(41), గ్లెన్ ఫిలిప్స్(48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(4/56) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. భారత్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్ .. భారత్‌ను 156 పరుగులకే ఆలౌట్ చేసి 103 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.

Story first published: Saturday, October 26, 2024, 10:45 [IST]
Other articles published on Oct 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+