Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఓయ్ జడేజా బుద్దుందా? అదెలా ఔటయ్యా! బుడ్డ పోరడు కూడా రివ్యూ తీసుకోడు!

IND vs NZ: Ravindra Jadeja And Rahane Takes The Worst DRS Review Possible In The History Of Cricket

కాన్పూర్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌పై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా సూచనలతో టీమిండియా తీసుకున్న ఓ రివ్యూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. జడేజా పట్టుబట్టడంతో ఎల్బీడబ్ల్యూ విషయంలో సమీక్షకు వెళ్లిన భారత్‌కు భంగపాటుకు గురైంది. అయితే ఈ వికెట్ కోసం రివ్యూకు వెళ్లడాన్ని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. టీవీల ముందు కూర్చున్న తమకే అది ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తుందని, అలాంటిదాని కోసం రివ్యూకెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇదో చెత్త రివ్యూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్, సోమర్ విల్లే ఆచితూచి ఆడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే జడేజా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో భారత్ రివ్యూకెళ్లి నిరాశకు గురైంది. ఈ ఓవర్ ఐదో బంతిని జడేజా ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా వేయగా.. టామ్ లాథమ్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ బంతి అతని బ్యాట్ తాకకుండా నేరుగా ప్యాడ్ తగిలింది. దాంతో భారత్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. దాంతో రివ్యూ కోసం జడేజా పట్టుబట్టాడు. కానీ రిప్లేలో బంతి ఔట్ సైడ్ ఇంపాక్ట్‌గా తేలడంతో భారత్‌కు భంగపాటుకు గురైంది. అంతేకాకుండా బంతి సిక్త్ స్టంప్ దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది.దీన్ని చూసిన అభిమానులు భారత్ రివ్యూ తీసుకోవడాన్ని చూసి తలలు బాదుకున్నారు.

రహానే చెత్త కెప్టెన్సీ..

రహానే చెత్త కెప్టెన్సీ..

ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఔటైనా రివ్యూ తీసుకోకుండా విమర్శలు ఎదుర్కొన్న రహానే.. చివరి రోజు మాత్రం జడేజా సూచనలతో అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. అది వికెట్లకు దూరంగా వెళ్తుందని స్పష్టంగా కనిపిస్తున్నా రివ్యూ తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు.

రహానే బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా విఫలమవుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన టేయిలెండర్ సోమర్ విల్లేను ఔట్ చేయకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చెత్త డీఆర్‌ఎస్..

ప్రముఖ తెలుగు క్రికెట్ అనలిస్ట్ సీ వెంకటేశ్ సైతం జడేజా తీసుకున్న రివ్యూను తప్పుబట్టారు. ట్విటర్ వేదికగా జడేజాను, రహానే కెప్టెన్సీపై విమర్శలు గుప్పించారు. 'ఓ బౌలర్‌గా జడేజా అత్యంత చెత్త రివ్యూ తీసుకున్నాడు. టీవీల ముందు కూర్చున్నవారికి కూడా అది ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. బంతి ఐదు లేదా ఆరో స్టంప్ దిశగా దూసుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయినా టీమిండియా రివ్యూను వృథా చేసింది. ఇక బ్యాట్స్‌మన్‌గా విఫలమైన రహానే కెప్టెన్‌గా కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. ఐదో రోజు తొలి గంట ముగిసినా.. అక్షర్ పటేల్‌కు బంతిని ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది'అని ఆయన ట్వీట్ చేశారు.

ఉత్కంఠగా మ్యాచ్..

ఉత్కంఠగా మ్యాచ్..

భారత్-న్యూజిలాండ్ ఆట ఆఖరి మజిలీకి చేరింది. న్యూజిలాండ్‌ను లక్ష్యం ఊరిస్తోంది. భారత్‌ను గెలుపు పిలుస్తోంది. దాంతో ఈ మ్యాచ్ మలుపులు తీసుకుంటూ సాగిపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నంగ్స్‌లో 296 పరుగులకే కుప్పకూలింది.

దాంతో 49 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట చివర్లో 234/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలో షాక్ ఇచ్చింది. 4 పరుగులకే తొలి వికెట్ తీసి నాలుగో రోజు ఆటను ముగించింది.

4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన కివీస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నిలకడగా ఆడుతుంది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్(35 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ సోమర్ విల్లే(35 బ్యాటింగ్) నిలకడగా ఆడుతుండటంతో కివీస్ 79/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Monday, November 29, 2021, 11:50 [IST]
Other articles published on Nov 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+