Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అశ్విన్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన డేవాన్ కాన్వే! (వీడియో)

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టన్నింగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో కళ్లు చెదిరే బంతితో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(105 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 91)‌ శతకాన్ని అడ్డుకున్నాడు. డెవాన్ కాన్వే షాట్‌ను ముందుగానే పసిగట్టిన అశ్విన్.. అందుకు తగ్గట్లు బౌలింగ్ చేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. అశ్విన్ స్టన్నింగ్ డెలివరీకి డెవాన్ కాన్వే బిత్తరపోయాడు.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 40వ ఓవర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని కాన్వే రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ షాట్ సెలెక్షన్‌ను ముందుగానే పసిగట్టిన అశ్విన్ ఫుల్‌బాల్‌తో కాన్వేను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన కాన్వే మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి మిడిల్ స్టంప్‌తో పాటు లెగ్ స్టంప్‌ను పడేసింది.

IND vs NZ Ravichandran Ashwin sends well-set Devon Conway with a beauty Video goes viral

అయితే వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ గ్లోవ్స్‌ను స్టంప్స్ ముందుకు జరిపాడా? అనే సందేహంతో థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించాడు. నిబంధనల ప్రకారమే కీపింగ్ చేయడంతో కాన్వేను ఔట్‌గా ప్రకటించాడు. వికెట్ల కన్నా ముందు గ్లోవ్స్ వస్తే నోబాల్‌గా ప్రకటిస్తారు. అశ్విన్ స్పిన్ దెబ్బకు కాన్వే శతకాన్ని చేజార్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది.

క్రీజులో రచిన్ రవీంద్ర(22 బ్యాటింగ్)తో పాటు డారిల్ మిచెల్(14 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డెవాన్ కాన్వే(91), విల్ యంగ్(33) రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేలా తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, October 17, 2024, 20:37 [IST]
Other articles published on Oct 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+