For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే రోహిత్, కోహ్లీలను టీ20లకు దూరం పెట్టాం: రాహుల్ ద్రవిడ్

IND vs NZ: Rahul Dravid reveals why Rohit Sharma and Virat Kohli are out of the T20 team

ఇండోర్: ఈ ఏడాది జరగనున్న కీలక టోర్నీల నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను టీ20లకు దూరం పెట్టామని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి ప్రధాన టోర్నీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన ద్రవిడ్.. ఈ టోర్నీలకు రోహిత్, కోహ్లీలను ఫ్రెష్‌గా ఉంచాలనే టీ20 ఫార్మాట్‌లకు దూరంగా ఉంచుతున్నామని స్పష్టం చేశాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీలను దూరం పెట్టడంతో ఈ సీనియర్ ఆటగాళ్ల‌ను టీ20 ఫార్మాట్‌ నుంచి పక్కనపెడుతున్నారే ప్రచారం ఊపందుకుంది. సీనియర్ ఆటగాళ్లను పూర్తిగా టీ20 ఫార్మాట్‌కు దూరం చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ప్రధాన టోర్నీల కోసం..

ప్రధాన టోర్నీల కోసం..

ఇక న్యూజిలాండ్‌తో మూడో వన్డే నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా క్లారిటీ ఇచ్చాడు. 'బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఫ్రెష్‌గా ఉంచాలనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిచ్చాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలకు మేం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోహ్లీ, రోహిత్‌లను టీ20లకు దూరం పెట్టాం'అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.

రోహిత్ కెరీర్ టర్నింగ్ పాయింట్..

రోహిత్ కెరీర్ టర్నింగ్ పాయింట్..

ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అండర్ -19 ప్లేయర్‌గా ఉన్నప్పటి నుంచి రోహిత్ శర్మను చూస్తున్నానని చెప్పిన ద్రవిడ్..కెప్టెన్‌గా అతను ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడాడు. 'రోహిత్ శర్మ భారత క్రికెట్‌కు ఎంతో చేసాడు. గత 15 ఏళ్లుగా అసాధారణమైన ఆటతో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ మాత్రం ఓపెనర్‌గా బరిలోకి దిగడం. అక్కడి నుంచి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అతను రాణించిన తీరు అమోఘం.

అసాధారణ ప్లేయర్..

అసాధారణ ప్లేయర్..

2019 వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడిన తీరు.. వన్డే క్రికెట్‌లో అతను సాధించిన మూడు డబుల్ సెంచరీలు అమోఘమైన ఘనతలు. రోహిత్ శర్మ 17-18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి చూసినట్లు గుర్తుంది. అప్పుడే అండర్ -19 క్రికెట్ నుంచి వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ రోహిత్ ఎంతో మారాడు. క్రికెటర్‌గా ఎంతో సాధించాడు. అతను అద్భుతమైన భారత ఆటగాడు. భారత కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంతో సక్సెస్ సాధించాడు. అతనిలో అన్ని నైపుణ్యాలున్నాయి. పూర్తి స్థాయి బ్యాటర్ అతను. రోహిత్ జట్టును నడిపిస్తున్న తీరును చూడటం గొప్పగా ఉంది.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభానికి వారం ముందే క్యాంప్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 2న జట్టు ఆటగాళ్లంతా సమవేశమవుతారని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

 టీమిండియా జైత్రయాత్ర..

టీమిండియా జైత్రయాత్ర..

కొత్త ఏడాది టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. హైదరాబాద్ వన్డేలో 12 పరుగులతో గట్టెక్కిన రోహిత్ సేన.. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్లతో కివీస్‌ను చిత్తు చేసింది. చివరిదైన నామమాత్రపు వన్డే కోసం సిద్దమవుతోంది. ఇండోర్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంటే.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ అనుకుంటుంది.

Story first published: Monday, January 23, 2023, 20:19 [IST]
Other articles published on Jan 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+