
టాపార్డర్ విఫలమైనా..
14/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(33 బంతుల్లో 22) వికెట్ కోల్పోయింది. జెమీసన్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు పుజారా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ ఔటివ్వకపోయినప్పటికీ.. కివీస్ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(2)ను ఆజాజ్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సౌథీ ఒకే ఓవర్‌లో మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజాలను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. తొలుత మయాంక్ అగర్వాల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన సౌథీ... జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. జడేజా రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో భారత్ 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న అయ్యర్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో టీమిండియా 84/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం అయ్యర్, అశ్విన్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. 6వ వికెట్‌కు 52 పరుగులు జోడించిన అనంతరం జెమీసన్ బౌలింగ్‌లో అశ్విన్(32) ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సాహాతో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని భారత ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. అయితే మరో సెంచరీ వైపు దూసుకెళ్తున్న అయ్యర్(65)ను సౌథీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు.

మెరిసిన సాహా..
కానీ గాయంతో బరిలోకి దిగిన సాహా(61 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అక్షర్ పటేల్ (28 నాటౌట్)సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరు 67 పరుగుల భాగస్వామ్యం అందించడంతో భారత్ 234/7 స్కోర్ డిక్లేర్ ఇచ్చింది. ఫీల్డింగ్ చేసి అలసిపోయిన కివీస్ బ్యాట్స్‌మన్‌ను త్వరగా ఔట్ చేయవచ్చే వ్యూహంతో వారికి చివరి క్షణంలో బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇక భారత్ అనుకున్నట్లుగానే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో కివీస్ 4 పరుగులకే ఓ వికెట్ కోల్పోయి నాలుగో రోజు ఆటను ముగించింది.


Click it and Unblock the Notifications
