Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ సెమీఫైనల్ మ్యాచ్‌కు రెడ్ సాయిల్ పిచ్.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

IND vs NZ Pitch Report: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. న్యూజిలాండ్‌తో బుధవారం వాంఖడే వేదికగా జరగనున్న సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన రోహిత్ సేన.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది.

తద్వారా గత ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. లీగ్ దశలో ఇప్పటికే కివీస్‌ను మట్టికరిపించిన రోహిత్ సేన.. రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్‌ను ఓడించి.. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని కివీస్ భావిస్తోంది. ఏది ఏమైనా ఈ సెమీస్ పోరు అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది.

IND vs NZ Pitch Report: Rohit Sharma says toss is not the factor

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. బీసీసీఐ కూడా ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ పిచ్ సిద్దం చేసింది. పేసర్లకు అనుకూలించేలా పిచ్‌పై గ్రాస్ కూడా వదిలేసింది. ఇక వాంఖడే పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఈ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.

ఇది హైస్కోరింగ్ వేధిక. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు యావరేజ్ స్కోర్ 357. తాజా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 399 పరుగులు చేసింది. శ్రీలంకపై భారత్ 357 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం రెడ్ సాయిల్ పిచ్‌లనే ఉపయోగించారు. ఈ పిచ్‌పై పేసర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు రెడ్ సాయిల్ పిచ్ సిద్దం చేసినా.. గ్రాస్ వదిలేసారు. డ్యూ కూడా కీలకం కానుంది. రెండో ఇన్నింగ్స్ పిచ్ విభిన్నంగా ఉండనుంది. తాజా టోర్నీ ట్రెండ్ చూస్తే ఈ వికెట్‌పై సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. శ్రీలంకను టీమిండియా 55 పరుగులకే ఆలౌట్ చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ అసాధారణ ఇన్నింగ్స్‌తోనే ఆసీస్ ఈ వికెట్‌పై లక్ష్యాన్ని చేధించింది.

IND vs NZ Pitch Report: Rohit Sharma says toss is not the factor

ఈ మైదాన చరిత్రను చూస్తే మాత్రం ఇక్కడ 27 మ్యాచ్‌లు జరగ్గా.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే 14 సార్లు విజయం సాధించాయి. చేజింగ్‌ టీమ్స్ 13 సార్లు గెలిచాయి.

రోహిత్ శర్మ మాత్రం ఈ మైదానంలో టాస్ పాత్ర ఏం ఉండదని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పిచ్ గురించి మాట్లాడిన రోహిత్ శర్మ.. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌ల్లో వాంఖడే స్వభావం బయటపడలేదన్నాడు.

'ఇక్కడ నేను చాలా క్రికెట్ ఆడాను. గత 4-5 మ్యాచ్‌ల్లో వాంఖడే స్వభావం బయట పడలేదు. వాంఖడే పిచ్ ఎలా ఉంటుంది? అనేదాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు. కానీ ఈ మైదానంలో టాస్ పాత్ర పెద్దగా ఉండదని మాత్రం చెప్పగలను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2023, 21:05 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+